Ponguleti srinivas reddy:గత ప్రభుత్వం భారీగా అప్పులు మిగిల్చినప్పటికీ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సమపాళ్లలో ముందుకు తీసుకువెళ్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా పేద ప్రజల సంక్షేమం కోసం ఈ పథకాలను కొనసాగిస్తున్నామని వెల్లడించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఈ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తామని భరోసా ఇచ్చారు.
Read also: Konda Surekha : 'కొండా సురేఖ'కు సపోర్ట్ చేస్తున్న ఆ ఇద్దరు మంత్రులు ఎవరు ?
Continuation of government welfare schemes
రైతులకు సన్న వడ్ల బోనస్
వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా సన్న వడ్లు సాగు చేసే రైతులకు క్వింటాల్‌కు ఐదు వందల రూపాయల బోనస్ అందిస్తున్నట్లు తెలిపారు. అన్నదాతలను ఆదుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తోందని చెప్పారు.
Ponguleti srinivas reddy:పెండింగ్ బిల్లుల చెల్లింపులు
గత పాలనలో నిలిచిపోయిన బకాయిలను దశలవారీగా చెల్లిస్తూ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. సుమారు నలభై వేల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులతో పాటు సర్పంచ్‌లకు సంబంధించిన బాకీలను కూడా పూర్తిగా చెల్లించినట్లు స్పష్టం చేశారు. వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు మెరుగైన సుపరిపాలన అందించామని తెలిపారు.
Epaper: epaper.vaartha.com

