Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్రిడిటేషన్‌ కార్డులు.. పొంగులేటి

అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్రిడిటేషన్‌ కార్డులు.. పొంగులేటి

వార్త 1 month ago

TG Journalist Accreditation Cards: జర్నలిస్టులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొత్త అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభమైంది.

గురువారం హైదరాబాద్‌ హిమాయత్ నగర్‌లోని స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జర్నలిస్టులకు ఈ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌ కార్డులు అందజేస్తామని, ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి రెండో ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఒకవేళ కార్డు పొందిన తర్వాత ఎవరైనా సంస్థ మారితే, ఆ సమాచారాన్ని అధికారులకు తెలియజేస్తే వారి కార్డులను తొలగించబోమని భరోసా ఇచ్చారు.

Read Also: Medak: బాలల పరిరక్షణ కమిటీలను బలోపేతం చేయాలి: మండల ప్రత్యేక అధికారి జగదీష్

 Journalist Accreditation Cards Distribution

TG Journalist Accreditation Cards: 15 రోజుల్లో ప్రక్రియ పూర్తి

గత ప్రభుత్వ హయాంలో అక్రిడిటేషన్ల సంఖ్య 32 వేల నుండి 35 వేల మధ్య ఉండేదని, తమ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జీవోల వల్ల సుమారు 46 వేల మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయి కార్డుల్లో 2500 మందికి క్లియరెన్స్ ఇచ్చామని, జిల్లా స్థాయి కార్డుల మంజూరుపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. రాబోయే 15 రోజుల్లో అర్హులందరికీ కార్డుల మంజూరు పూర్తి చేస్తామని మంత్రి ప్రకటించారు.

జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట

కొత్త దరఖాస్తులకు ఒక గడువు (డెడ్ లైన్) నిర్ణయించాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఖచ్చితమైన సంఖ్య తెలిస్తే, దాని ఆధారంగా జర్నలిస్టుల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు. పాత కార్డుల గడువు ముగియడంతో, యుద్ధ ప్రాతిపదికన కొత్త కార్డుల జారీని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

'TRS' నాకు రాసిపెట్టి ఉందేమో.. కవిత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha