Kavitha New Party: కల్వకుంట్ల కవిత ప్రకటించిన నూతన రాజకీయ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఎట్టకేలకు ఆమోదముద్ర వేసింది. కవిత తొలుత 'తెలంగాణ రాష్ట్ర సేన' అనే పేరును ప్రతిపాదించినప్పటికీ, సాంకేతిక కారణాల దృష్ట్యా ఎన్నికల సంఘం 'తెలంగాణ రక్షణ సేన' అనే పేరును ఖరారు చేసింది.
Read Also:Hyderabad: మే 10వ తేదీన హైదరాబాద్ కు రానున్న ప్రధాని మోదీ
The goal is the struggle for existence: Kalvakuntla kavitha
Kavitha New Party: కవిత భావోద్వేగం
పార్టీకి ఆమోదం లభించడంపై కవిత సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. “TRS పార్టీ నాకు రాసిపెట్టి ఉందేమో” అంటూ ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనవరి 2026లో జాతీయ ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఐదు పేర్లతో దరఖాస్తు చేసుకున్నామని, అందులో తాము మూడవ ప్రాధాన్యతగా ఇచ్చిన పేరును ఈసీ ఆమోదించడం కేవలం యాదృచ్ఛికమని ఆమె పేర్కొన్నారు. పాత పేరుతో ఉన్న అనుబంధం మళ్ళీ కొత్త రూపంలో రావడంపై ఆమె తన సంతోషాన్ని పంచుకున్నారు.
తెలంగాణ అస్తిత్వమే ధ్యేయం
గత రెండు దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ, పునరుజ్జీవం కోసం తాను చేసిన కృషిని ఇకపై పార్టీ ద్వారా మరింత బలోపేతం చేస్తానని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణే ధ్యేయంగా, అంకితభావంతో ప్రజల కోసం పనిచేస్తానని తెలంగాణ సమాజానికి ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
మే నెలలో ఏకంగా 9 రోజులు బ్యాంకులు బంద్.. ఎప్పుడెప్పుడో తెలుసా?

