Dailyhunt
మీ మొబైల్‌లోనే జనగణన నమోదు చేసుకోండి.. ఆర్డీఓ కేశవ నాయుడు

మీ మొబైల్‌లోనే జనగణన నమోదు చేసుకోండి.. ఆర్డీఓ కేశవ నాయుడు

వార్త 5 days ago

Census 2027: ఏప్రిల్ 16వ తేదీ నుండి 30వ తేదీ వరకు జనగణన 2027 కి సంబంధించిన స్వీయ నమోదు స్వీయగణన ప్రక్రియ కొనసాగుతోందని, జనగణన కార్యక్రమంలో తమ వివరాలు పూర్తిగా నమోదు చేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంటాయని, ఇందులో ఎలాంటి అపోహలు లేకుండా జనగణనలో నమోదుకు సహకరించాలని ఆర్డిఓ కేశవ నాయుడువిజ్ఞప్తిచేశారు.శుక్రవారం మండల కేంద్రంలో గత మూడురోజులుగా జరుగుతున్న జనగణన శిక్షణ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు.

Read Also:Kalyandurgam: కళ్యాణదుర్గంలో రక్తదాన ప్రభంజనం.. ప్రాణదాతలకు రూ. 3 లక్షల ఇన్సూరెన్స్ ఫ్రీ!

ఈ సందర్భంగా ఆర్డిఓ కేశవనాయుడు మాట్లాడుతూ జనగణనలో స్వీయ నమోదుచేసుకునే వారు మొబైల్ లో ఐతే వారు హెచ్.ఎల్.ఓ (హౌస్ లిస్టింగ్ యాప్) యాప్ నందు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని, ఇది సులువైన ప్రక్రియ అని తెలిపారు. ఇలా ముందుగానే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడం వల్ల సెన్సస్ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ సమయంలో మీ సమయం ఆదా అవుతుందనీ, మరియు సిబ్బంది త్వరగా గణనను పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.

Census 2027: 10 లక్షల గృహాలే లక్ష్యం

కాబట్టి ప్రతి ఒక్కరూ తమ వివరాలను స్వీయ నమోదు చేయాలన్నారు.మీరు ఇచ్చే ప్రాథమిక వివరాలు అత్యంత గోప్యంగా సురక్షితంగా ఉంటాయనీ, ఈ డేటాను ఇతరులకు షేర్ చేయడం జరగదనీ, ఇది కేవలం సెన్సస్ డిపార్ట్‌మెంట్ వద్ద మాత్రమే ఉంటుందనీ, సదరు సమాచారం భవిష్యత్తులో మనకు అవసరమయ్యే వసతులు, అవసరాల కోసం ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేయడానికి ఎంతగానో ఉపకరిస్తుందని అన్నారు.ప్రజలు నమోదు చేసే వారి సమాచారానికి, వారికి అందుతున్న ప్రభుత్వ పథకాలకు లేదా బెనిఫిట్స్‌కు ఎటువంటి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు.

 Census 2027 Self Enumeration Process

కాబట్టి ఎటువంటి భయం లేదా అపోహలు లేకుండా ఖచ్చితమైన సమాచారాన్ని అందించాలని కోరారు. జిల్లాలో సుమారు 10 లక్షల గృహాలు ఉన్నట్లు అంచనా. ఈ 15 రోజుల వ్యవధిలో ప్రతి ఒక్కరూ తమ ఇంటి సంబంధిత వివరాలను స్వీయ నమోదు చేయాలని కోరుతున్నామన్నారు. ప్రభుత్వం మన భవిష్యత్తు ప్రణాళికల కోసం ఈ గణన ఎంతో కీలకం, జన గణనలో పాల్గొందాం – సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యులైదామని, ఆయన పిలుపునిచ్చారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శింగనమలతహసిల్దార్ శేషారెడ్డి పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

అభివృద్ధి పనులను వేగవంతం చేయండి: ఆర్డిఓ కేశవనాయుడు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha