Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Arjun Tendulkar: ప్రధాని మోదీని కలిసిన సచిన్ కుటుంబం

Arjun Tendulkar: ప్రధాని మోదీని కలిసిన సచిన్ కుటుంబం

వార్త 4 months ago

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar), సానియా చందోక్‌ల వివాహానికి ప్రధాని నరేంద్ర మోడీని కుటుంబంతో కలిసి మంగళవారం ఆహ్వానించారు.

సచిన్ టెండూల్కర్, యువ జంటకు ప్రధాని ఆశీర్వాదాలు, సలహాలకు ధన్యవాదాలు తెలిపారు. అర్జున్ ప్రస్తుతం గోవా జట్టు తరపున దేశీయ క్రికెట్ ఆడుతుండగా, సానియా ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందినవారు, పెంపుడు జంతువుల సంరక్షణ వ్యాపారంలో భాగస్వామిగా ఉన్నారు. గతంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా వివాహానికి ఆహ్వానించారు.

T20 World Cup: అమెరికాపై పాకిస్థాన్ ఘన విజయం

ప్రత్యేకంగా ఫొటో

ప్రధాని మోదీని కలిసి అర్జున్ (Arjun Tendulkar, సానియా వివాహానికి ఆహ్వానించడాన్ని తాము గౌరవంగా భావిస్తున్నామని సచిన్ టెండూల్కర్ పేర్కొన్నారు. కాబోయే జంటను ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ వద్దకు సచిన్ కుటుంబంతో పాటు సానియా చందోక్, ఆమె తల్లిదండ్రులు కూడా వచ్చారు. మోదీ వారిని ఆత్మీయంగా పలకరించి,

కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం మోదీతో ఇరు కుటుంబాలు కలిసి ఫొటో దిగాయి. అర్జున్, సానియా ప్రధాని మోదీతో ప్రత్యేకంగా ఫొటో దిగారు. ముంబైకి చెందిన వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్. ఆమె కూడా వ్యాపారవేత్త అని తెలిసిందే.

Read hindi news: hindi.vaartha.com

Ind vs Pak : 10 రోజుల్లో యూటర్న్, భారత్‌తో మ్యాచ్‌కు పాక్ ఓకే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha