Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఏపీకి తెలంగాణ, తమిళనాడు సాయం

అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఏపీకి తెలంగాణ, తమిళనాడు సాయం

వార్త 3 weeks ago

Arnab Cyclone: ఆంధ్రప్రదేశ్‌లో 'అర్నబ్' తుఫాన్ కారణంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. బలమైన ఈదురు గాలులకు వేలాది విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో పలు ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లాయి.

విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు ఏపీ విద్యుత్ శాఖ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల సాయం కోరింది.

Read Also : AP Wine Shops Closed: ఏపీలో రెండు రోజుల పాటూ వైన్ షాపులు బంద్

 Havoc caused by Cyclone Arnab; Telangana and Tamil Nadu extend aid to AP

Arnab Cyclone: తమిళనాడు సహకారాన్ని కోరిన మంత్రి గొట్టిపాటి

సీఎం చంద్రబాబు ఆదేశాలతో విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు విద్యుత్‌శాఖ మంత్రితో ఫోన్‌లో మాట్లాడారు. తుఫాన్ కారణంగా విద్యుత్ వ్యవస్థకు జరిగిన నష్టాన్ని వివరించి, మరమ్మతుల కోసం అదనపు సిబ్బంది, అవసరమైన సామగ్రిని పంపాలని కోరారు. ఏపీ విజ్ఞప్తికి తమిళనాడు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, తక్షణమే సహాయక సిబ్బందిని, సామగ్రిని పంపేందుకు సుముఖత వ్యక్తం చేసింది.

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా ఏపీకి పూర్తిస్థాయిలో అండగా నిలిచింది. మంత్రి గొట్టిపాటి రవికుమార్ విజ్ఞప్తిపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి తక్షణ సాయం అందించారు. తెలంగాణ నుంచి TGSPDCLకు చెందిన 1,300 మందికి పైగా విద్యుత్ సిబ్బందితో పాటు 15కు పైగా అత్యవసర వాహనాలు, అవసరమైన విద్యుత్ పరికరాలు ఇప్పటికే ఏపీకి చేరుకున్నాయి.

మరమ్మతు పనుల్లో 640 మంది సిబ్బంది

అమలాపురం పరిధిలో 78 బృందాలుగా ఏర్పడిన 640 మంది తెలంగాణ విద్యుత్ సిబ్బంది మరమ్మతు పనులు చేపట్టారు. దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్లను బాగుచేస్తున్నారు. మిగిలిన సిబ్బంది తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోనూ పునరుద్ధరణ పనుల్లో పాల్గొంటున్నారు. పొరుగు రాష్ట్రాల సహకారంతో విద్యుత్ సరఫరాను త్వరగా పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ పేరు మార్పు.. నవంబర్ 21 నుంచి అమలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha