Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అర్థరాత్రి విద్యార్థులు రోడ్లపై తిరిగితే తీవ్ర చర్యలు.. సీపీ సుమతి గట్టి హెచ్చరిక

అర్థరాత్రి విద్యార్థులు రోడ్లపై తిరిగితే తీవ్ర చర్యలు.. సీపీ సుమతి గట్టి హెచ్చరిక

వార్త 3 months ago

CP Sumathi: తల్లిదండ్రులు తమ పిల్లల బంగారు భవితకు లక్షల రూపాయలను ఖర్చుచేస్తున్నారు. తమ పిల్లలు ఉన్నతంగా ఎదగాలని ఆశిస్తూ, వారికి ఉన్నత చదువులను అందించేందుకు పట్టణాలకు, నగరాలకు పంపుతున్నారు.

ఇందుకోసం తమ కష్టార్జితాన్ని పణంగా పెట్టి, డబ్బు పంపుతున్నారు. యువత నగరాల్లోని హాస్టల్స్ లో ఉంటూ బుద్ధిగా చదువుకుని, తాము వచ్చిన కర్తవ్యాన్ని నెరవేర్చుకుంటున్నవారు కొందరు అయితే మరికొందరు మాత్రం తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నాం, తమను ఎవరూ చూడడం లేదని చెడు స్నేహితులతో కలిసి, చెడు అలవాట్లకు, తిరుగుళ్లకు బానిసలుగా మారుతున్నారు.

Read also: Kamareddy incident: పైపులైన్ గుంతలోకి పల్టీ కొట్టిన కారు.. కొన ఊపిరితో బయటపడ్డ దంపతులు

 CP Sumathi warning to students in city

CP Sumathi: హాస్టల్ నిర్వాహకులకు గట్టి వార్నింగ్

ఈ మత్తునుంచి కాపాడేందుకు పోలీసు యంత్రాంగం సరికొత్త వ్యూహాలను అమలు చేసేందుకు ముందుకు వచ్చినట్లు మల్కాజిగిరి సీపీ సుమతి పేర్కొన్నారు. ఇటీవల ఆమె అర్థరాత్రి దిల్ సుఖ్ నగర్ లో రోడ్డుపై నిలబడినప్పుడు ఆమెకు ఎదురైన అనుభవాలు తెలిసిందే. పలువురు పోకిరీలు సుమతి వద్దకు వచ్చి, ‘వస్తావా! రేటెంత?’ అంటూ ఆమెను అడిగారు. దీంతో అర్థరాత్రి నుంచి 3.30 గంటల వరకు అక్కడే గడిపిన సుమతి దాదాపు 40మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో గంజాయి, ఆల్కోహాల్ సేవించినవారే అధికంగా ఉన్నారు.

హాస్టళ్ల నిర్వాహకులతో సమన్వయ సమావేశం

ఈ ఘటన అనంతరం సుమతి దిల్సుఖ్ నగర్ లోని హాస్టళ్ల నిర్వాహకులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారే హాస్టళ్లను సీజ్ చేయడానికి వెనుకాడబోమని ఆమె హెచ్చరించారు. అంతేకాక విద్యార్థుల కదలికలపై నిరంతర నిఘా ఉంటుందని, నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని సుమతి స్పష్టం చేశారు. మత్తు పదార్థాలను అందించే పాన్ షాపులపై కూడా సీపీ ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. కమిషనరేట్ ఏరియాలో సరూర్ నగర్ ప్రాంతం ప్రముఖమైనదని సీపీ సుమతి తెలిపారు. ఇక్కడ వేలమంది యువత పలు పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు ఏపీ, తెలంగాణ నుంచి వచ్చినవారు ఎక్కువగా ఉన్నట్లు ఆమె చెప్పారు. యువత నేరాలబాట పట్టకుండా ఉండేందుకు సరూర్ నగర్ పోలీసు, ఎల్ బీనగర్ సంయుక్తంగా వీరిపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నట్లు చెప్పారు

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పోస్టల్ ఐపీ అధికారి అరెస్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha