Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రతిష్టాత్మకమైన హేట్ స్పీచ్ బిల్లు (Hate Speech Bill)ను ప్రవేశపెట్టింది. గత సోమవారం రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం పొందిన ఈ బిల్లును, శాసనసభ స్పీకర్ తదుపరి పరిశీలన కోసం సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేశారు.
సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా సాగుతున్న విద్వేష పూరిత వ్యాఖ్యలను అరికట్టడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశ్యం.
Read Also: Telangana: కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు: సీఎం రేవంత్ రెడ్డి
బిల్లులోని ముఖ్యాంశాలు, శిక్షలు
మతం, కులం, జాతి, లింగం, భాష లేదా నివాసం వంటి కారణాలతో విద్వేషం రేకెత్తించే వారికి ఈ చట్టం కింద కఠిన శిక్షలు ఖరారు చేశారు. విద్వేష ప్రసంగాలు లేదా పోస్టులు మొదటిసారి రుజువైతే 7 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు రూ. 50,000 జరిమానా విధిస్తారు.అదే వ్యక్తి మళ్లీ నేరానికి పాల్పడితే 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ. 1,00,000 జరిమానా ఉంటుంది.ఈ చట్టం కింద నమోదయ్యే కేసులను నాన్-బెయిలబుల్ (Non-Bailable) నేరాలుగా పరిగణిస్తారు.
Telangana Assembly introduces Hate Speech Bill
సోషల్ మీడియాపై నిఘా
ఇటీవల కాలంలో సోషల్ మీడియా (Facebook, X, WhatsApp మొదలైనవి) వేదికగా రెచ్చగొట్టే పోస్టులు పెరిగాయని ప్రభుత్వం భావిస్తోంది. కేవలం ప్రసంగాలే కాకుండా మాటల ముద్రణ, ప్రచురణ, సోషల్ మీడియా పోస్టులు, ఎలక్ట్రానిక్ సందేశాలు కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తాయి.ఏదైనా అసభ్యకర లేదా విద్వేష పూరిత కంటెంట్ ఉంటే, వాటిని వెంటనే తొలగించాలని సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించే అధికారం అధికారులకు ఉంటుంది.సంఘం, సమూహం లేదా బహిరంగ సమావేశాల్లో రెచ్చగొట్టేలా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

