Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వట్‌పల్లి పోలీస్ స్టేషన్‌పై గ్రామస్తుల దాడి

వట్‌పల్లి పోలీస్ స్టేషన్‌పై గ్రామస్తుల దాడి

వార్త 6 days ago

Sangareddy News:సంగారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత … వట్పల్లి పోలీస్ స్టేషన్‌పై గ్రామస్తుల దాడి,సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దరఖాస్తుపల్లి గ్రామస్తులు వట్పల్లి పోలీస్ స్టేషన్‌పై దాడికి పాల్పడ్డారు. స్టేషన్‌లోని ఫర్నిచర్, అద్దాలను ధ్వంసం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి వట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ దాబాలో పనిచేస్తున్న బీరప్ప (22) అనే యువకుడు స్థానికంగా ఉన్న చెట్టుకు ఉరివేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. మృతుని కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం అందించకుండానే, హుటాహుటిన మృతదేహాన్ని చెట్టుపై నుండి కిందకు దించారు.

Read also: Hyderabad Bullet Train : తెలంగాణలో బుల్లెట్ ట్రైన్ హబ్ కలకలం: అధికారుల వివరణ!

 Sangareddy Vatpally Police Station

Sangareddy News:పంచనామా లేకుండానే మృతదేహం తొలగింపు

కుటుంబీకులకు తెలియజేయకుండా, ఎటువంటి పంచనామా లేదా సమాచారం లేకుండా మృతదేహాన్ని ఎలా కిందకు దించుతారంటూ మృతుని బంధువులు, దరఖాస్తుపల్లి గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు వట్పల్లి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పరిస్థితి చేయి దాటిపోవడంతో ఆగ్రహం వెళ్లగక్కిన ఆందోళనకారులు పోలీస్ స్టేషన్‌పై దాడికి తెగబడ్డారు. స్టేషన్ అద్దాలు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఘటన స్థలానికి చేరుకున్నాక, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఉన్నతాధికారులు అదనపు బలగాలను మోహరించారు. ఈ ఘటనపై మరింత సమాచారం సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Epaper: epaper.vaartha.com

నాపై కోపంతోనే సొరంగం పనులు ఆపేశారు.. కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి విమర్శలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha