Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అస్సాంలో మళ్ళీ 'హిమంత' హవా..

అస్సాంలో మళ్ళీ 'హిమంత' హవా..

వార్త 1 month ago

Assam Assembly Election Results: ఈశాన్య రాష్ట్రం అస్సాంలో కమల వికాసం కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని ఎన్డీఏ (NDA) కూటమి స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకుపోతోంది.

తాజా ట్రెండ్స్ ప్రకారం, బీజేపీ కూటమి మ్యాజిక్ ఫిగర్‌ను సునాయాసంగా దాటేసింది.

Read Also : Election Results: బెంగాల్, అస్సాంలో బీజేపీ జోరు

 Assam Assembly Election Results 2026

Assam Assembly Election Results: జాలుక్‌బరిలో సీఎం హిమంత దూకుడు

ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన సొంత నియోజకవర్గమైన జాలుక్‌బరి నుంచి భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయనతో పాటు ప్రభుత్వంలోని పలువురు కీలక మంత్రులు కూడా తమ నియోజకవర్గాల్లో ముందంజలో ఉండటం గమనార్హం.

తాజా ఆధిక్యాల వివరాలు (మొత్తం స్థానాలు: 126):

  • ఎన్డీఏ కూటమి (BJP+): 93 స్థానాల్లో ఆధిక్యం
  • కాంగ్రెస్ కూటమి (ASM): 25-28 స్థానాల్లో ఆధిక్యం
  • ఇతరులు: 2-5 స్థానాలు

రికార్డు స్థాయి ఓటింగ్.. బీజేపీ హ్యాట్రిక్?

ఏప్రిల్ 9న జరిగిన ఈ ఎన్నికల్లో అస్సాం ప్రజలు రికార్డు స్థాయిలో 85.96 శాతం ఓటింగ్ నమోదు చేశారు. పెరిగిన ఓటింగ్ శాతం అధికార పార్టీకే లాభం చేకూర్చినట్లు ఫలితాలు సూచిస్తున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే, అస్సాం రాజకీయ చరిత్రలో బీజేపీ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సరికొత్త రికార్డు సృష్టించనుంది. 35 జిల్లాల్లోని 40 కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ పటిష్ట భద్రత మధ్య కొనసాగుతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

తమిళనాడులో పొలిటికల్ హీట్.. డీఎంకేకు విజిల్ దెబ్బ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha