Dailyhunt
తమిళనాడులో పొలిటికల్ హీట్.. డీఎంకేకు విజిల్ దెబ్బ!

తమిళనాడులో పొలిటికల్ హీట్.. డీఎంకేకు విజిల్ దెబ్బ!

వార్త 5 days ago

Tamil Nadu Election Results: తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ అనూహ్య ఫలితాలను సాధిస్తోంది.

ద్రవిడ దిగ్గజ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలకు షాక్ ఇస్తూ విజయ్ పార్టీ మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది.

Read Also : అసలు ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుందో తెలుసా ?

రాష్ట్రవ్యాప్తంగా టీవీకే హవా

తాజా ట్రెండ్స్ ప్రకారం, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సుమారు 100కి పైగా నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ముఖ్యంగా చెన్నై, పరిసర ప్రాంతాల్లోని అనేక నియోజకవర్గాల్లో టీవీకే క్లీన్ స్వీప్ చేసే దిశగా ఉంది. అన్నాడీఎంకే కూటమి రెండో స్థానంలో ఉండగా, అధికార డీఎంకే మూడో స్థానానికి పడిపోవడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.

 TVK Party Leads in Tamil Nadu Elections

Tamil Nadu Election Results: రెండు చోట్లా విజయ్ ముందంజ

పార్టీ అధినేత విజయ్ తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ భారీ ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు, అధికార పక్షంలో నిరాశ నెలకొంది. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా తమ నియోజకవర్గాల్లో కొన్ని రౌండ్ల ముగిసేసరికి వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తోంది.

కింగ్ అవుతారా.. కింగ్ మేకర్ అవుతారా?

ప్రస్తుత ఆధిక్యాలు చూస్తుంటే టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఒకవేళ స్పష్టమైన మెజారిటీ (మ్యాజిక్ ఫిగర్) రాకపోతే రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో అన్నాడీఎంకే కూటమి మద్దతుతో టీవీకే ప్రభుత్వం కొలువుదీరే చాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, తమకే పూర్తి మెజారిటీ వస్తుందని టీవీకే శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఆధిక్యంలో ఉన్న, గెలిచే అభ్యర్థులను తక్షణమే పార్టీ కార్యాలయానికి చేరుకోవాలని టీవీకే నాయకత్వం ఆదేశించింది. భద్రతా కారణాల దృష్ట్యా, తదుపరి ప్రణాళికల కోసం గెలిచిన అభ్యర్థులను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

బెంగాల్, అస్సాంలో బీజేపీ జోరు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha