Dailyhunt
HRC వద్ద ఆత్మహత్యాయత్నం.. పోలీసుల వేధింపులే కారణమా?

HRC వద్ద ఆత్మహత్యాయత్నం.. పోలీసుల వేధింపులే కారణమా?

వార్త 1 week ago

Nampally case update: హైదరాబాద్ నాంపల్లిలోని మానవ హక్కుల కమిషన్ కార్యాలయం ముందు మంగళవారం ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.

ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు పోలీసులపై చేసిన ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి.

Read Also:Karimnagar Crime: కవల పిల్లలను కడతేర్చిన కసాయి తండ్రి!

‘దొంగ’ అని పోస్టర్లు అంటించారు

బాధితురాలి పేరు శ్రావణి. ఆమె కవాడిగూడ ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో గత ఐదేళ్లుగా పనిమనిషిగా పనిచేస్తోంది. ఇటీవల ఆ అపార్ట్‌మెంట్‌లో బంగారం దొంగతనం జరిగిందని, యజమాని ఇందిరా ప్రియదర్శిని గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు శ్రావణిని అనుమానితురాలిగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

Nampally case update: పోలీసుల విచక్షణారహిత దాడి

“పోలీసులు నన్ను స్టేషన్‌కు తీసుకెళ్లి విచక్షణారహితంగా కొట్టారు. నేను దొంగతనం చేయలేదని మొత్తుకున్నా వినలేదు. అంతటితో ఆగకుండా, అపార్ట్‌మెంట్ మొత్తం నా ఫోటోలను ‘దొంగ’ అని పోస్టర్లుగా అంటించి నన్ను తీవ్రంగా అవమానించారు” అని శ్రావణి కన్నీటి పర్యంతమైంది. ఈ అవమానం భరించలేకే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఆమె స్పష్టం చేసింది.

కమిషన్ సీరియస్: నివేదికకు ఆదేశం

బాధితురాలి ఆవేదనను ఆలకించిన మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. తక్షణమే సదరు మహిళను వేధించడం ఆపాలని పోలీసులను ఆదేశించారు. ఈ మొత్తం ఘటనపై లోతైన విచారణ జరిపి, ఈ నెల 30వ తేదీ లోపు పూర్తి స్థాయి నివేదికను కమిషన్‌కు అందజేయాలని పోలీసు శాఖకు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

HRC ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha