Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
"అతడికి ఇంకా 15 ఏళ్లే.. పిల్లాడిని పిల్లాడిలా ఉండనివ్వండి": జితేష్ శర్మ

"అతడికి ఇంకా 15 ఏళ్లే.. పిల్లాడిని పిల్లాడిలా ఉండనివ్వండి": జితేష్ శర్మ

వార్త 3 weeks ago

Jitesh Sharma: RCB ఆటగాడు జితేష్ శర్మ, వైభవ్ సూర్యవంశీ గురించి చేసిన వ్యాఖ్యలపై నెట్టింట విమర్శలు రావడంతో తాజాగా ఆయన స్పందించారు. వైభవ్ ప్రొఫెషనల్‌గా ఉండటం లేదని తాను అన్న మాటల వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని వివరించారు.

Read Also:Punjab Kings IPL 2026: అభిమాని కోసం రంగంలోకి దిగిన ప్రీతి జింటా

అసలు నిజం

“వైభవ్ ఒక 15 ఏళ్ల పిల్లాడు. అతడికి ఐస్ క్రీమ్ అంటే ప్రాణం. నా గదికి వచ్చి మరీ తింటాడు. నేను తినను కానీ అతడిని చూసి ఆనందిస్తాను. ఒక చిన్న పిల్లాడు ఐస్ క్రీమ్ కాకుండా ఇంకేం తింటాడు?” అని జితేష్ ప్రశ్నించారు. వైభవ్ చిన్న వయసులోనే అద్భుతంగా రాణిస్తున్నాడు కాబట్టి, ప్రపంచం అతడి నుంచి మిలిటరీ డిసిప్లిన్ ఆశిస్తోందని, కానీ తాను మాత్రం అతడికి పూర్తి స్వేచ్ఛ ఇస్తానని జితేష్ చెప్పుకొచ్చారు.

 Jitesh Sharma clarification on Vaibhav Suryavanshi ice cream comments

Jitesh Sharma: అద్భుతమైన ఫామ్

ఈ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన ఈ 15 ఏళ్ల కుర్రాడు ఏకంగా 404 పరుగులు చేసి జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. “నీకు ఇంకా పదిహేనేళ్లే కదా, టీవీ చూసుకో, నీకు నచ్చినవి తిను, కేవలం నీ బ్యాటింగ్ మీద మాత్రమే దృష్టి పెట్టు” అని తాను ఎప్పుడూ వైభవ్‌కు ధైర్యం చెబుతుంటానని జితేష్ వెల్లడించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

నరైన్ సెన్సేషనల్ రికార్డ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha