Dailyhunt
Athadu Re Release: 'అతడు' సినిమా రీ-రిలీజ్

Athadu Re Release: 'అతడు' సినిమా రీ-రిలీజ్

వార్త 1 month ago

Athadu Re Release: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన క్లాసిక్ చిత్రం 'అతడు' మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

దాదాపు రెండు దశాబ్దాల క్రితం విడుదలైన ఈ సినిమా ఫిబ్రవరి 28న సెకండ్ రీ-రిలీజ్‌గా థియేటర్లలో సందడి చేయనుంది. 20 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా సెకండ్ రీ-రిలీజ్ హక్కులను డిస్ట్రిబ్యూటర్లు 40 లక్షలకు కొనుగోలు చేశారు.గతంలో రీ-రిలీజ్ అయినప్పుడు కూడా ఈ సినిమా భారీ కలెక్షన్లు సాధించింది. ఈ రెండో రీ-రిలీజ్ కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Movie: ఓటీటీకి వచ్చేసిన 'ఈషా' హారర్ థ్రిల్లర్

బ్రహ్మి కామెడీ టైమింగ్, ఎక్స్‌ప్రెషన్స్‌కు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్

ఒక్కో సీన్, ప్రతి సీక్వెన్స్ ప్రేక్షకులకు ఒక కొత్త ఫీలింగ్‌ను ఇస్తూ.. ఎప్పటికీ బోర్ కొట్టని ఒక ఎవర్‌గ్రీన్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను పంచుతాయి. ఇక సెకండాఫ్‌లో వచ్చే ఫ్యామిలీ ఎపిసోడ్స్ సినిమాకు ప్రాణం పోశాయి. పల్లెటూరి వాతావరణం, ఉమ్మడి కుటుంబంలోని ఎమోషన్స్‌ను చాలా అందంగా చూపించారు.

వీటన్నింటికీ మించి బ్రహ్మానందం కామెడీ ట్రాక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బ్రహ్మి కామెడీ టైమింగ్, ఎక్స్‌ప్రెషన్స్‌కు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో మీమ్ క్రియేటర్స్‌కు అతడులోని బ్రహ్మానందం క్యారెక్టర్ ఎప్పటికీ దొరికే ఒక కంటెంట్ గని లాంటిది. ఇలాంటి క్లాసిక్ సినిమాను బిగ్ స్క్రీన్ మీద మళ్ళీ చూడాలనే అభిమానుల కోరిక మేరకు గతంలో ఒకసారి రీ రిలీజ్ చేస్తే, కలెక్షన్ల వర్షం కురిసింది. ఇప్పుడు ఆ మ్యాజిక్‌ను మళ్ళీ రిపీట్ చేస్తూ ఫిబ్రవరి 28న మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Vijay-Rashmika: రష్మిక మమ్మల్ని వివాహానికి పిలవదు: నటుడు ప్రమోద్‌శెట్టి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha