Maintenance of in-laws: కుటుంబ వ్యవస్థలో నైతిక విలువల పరంగా అత్తామామలను చూసుకోవడం కోడలి బాధ్యతగా సమాజం భావించినప్పటికీ, చట్టపరంగా అది తప్పనిసరి కాదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది.
కొడుకు మరణించిన తర్వాత తమకు భరణం కావాలంటూ వృద్ధ దంపతులు వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. కోడలికి అత్తామామలను పోషించాలనే చట్టపరమైన నిబంధన ఏదీ లేదని కోర్టు తేల్చి చెప్పింది.
Read also: Vijaypat Singhania: రేమండ్ గ్రూప్ మాజీ ఛైర్మన్ విజయ్‌పత్ సింఘానియా కన్నుమూత!

Court gavel and family silhouette representing legal rights.
Maintenance of in-laws: చట్టం ఏం చెబుతోంది? (BNSS సెక్షన్ 144)
భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) లోని సెక్షన్ 144 ప్రకారం, ఒక వ్యక్తి కేవలం తన భార్య, మైనర్ పిల్లలు మరియు తనను తాను పోషించుకోలేని తల్లిదండ్రులకు మాత్రమే భరణం చెల్లించాల్సి ఉంటుంది. ఈ జాబితాలో అత్తామామలు చేర్చబడలేదని న్యాయమూర్తి వివరించారు. చట్టం స్పష్టంగా ఉన్నప్పుడు, అదనపు బాధ్యతలను కోడలిపై రుద్దలేమని న్యాయస్థానం అభిప్రాయపడింది.
నైతికత vs చట్టం
సామాజికంగా కోడలు అత్తామామలను గౌరవించి, చూసుకోవడం సంప్రదాయమైనప్పటికీ, దానిని న్యాయపరమైన హక్కుగా క్లెయిమ్ చేయలేరని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా భర్త చనిపోయిన సందర్భంలో, కోడలికి ఉన్న పరిమితులు మరియు ఆమె సొంత అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని న్యాయస్థానం ఈ సందర్భంగా గుర్తు చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

