Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అత్యంత విషమంగా ప్రియాంక ఆరోగ్యం

అత్యంత విషమంగా ప్రియాంక ఆరోగ్యం

వార్త 2 weeks ago

Rajamahendravaram Medico Incident: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు కారుతో బీభత్సం సృష్టించిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ పీజీ వైద్య విద్యార్థిని ప్రస్తుతం బ్రెయిన్ డెడ్ (Brain Dead) పరిస్థితికి చేరుకున్నారు.

ఈ ఘాతుకానికి పాల్పడిన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గురువారం అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Read Also:Rajahmundry crime: దారుణం.. మెడికల్ విద్యార్థిని పై కారు ఎక్కించిన యువకులు

ఘటనకు సంబంధించిన వివరాలు

జీఎస్ఎల్ (GSL) మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్న ప్రియాంక (28), తన స్నేహితురాలితో కలిసి రాజమహేంద్రవరంలోని ఓ మాల్ నుంచి స్కూటీపై బయటకు వస్తున్నారు. మాల్ గేటు వద్దకు రాగానే, వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు వారి స్కూటీని బలంగా ఢీకొట్టింది. స్కూటీ కిందపడిపోయిన వారిని చూసి స్థానికులు, మాల్ సిబ్బంది స్పందించేలోపే.. కారు డ్రైవర్ వాహనాన్ని మళ్లీ ముందుకు పోనిచ్చి ప్రియాంకపై నుంచి తొక్కించాడు. ఈ ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ప్రియాంకను మొదట స్థానిక ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె బ్రెయిన్ డెడ్‌కు గురైనట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Rajamahendravaram Medico Incident: దాడికి గల కారణం – పోలీసుల విచారణ

డీసీపీ ఎ. సుభాష్ వెల్లడించిన వివరాల ప్రకారం. కారు నడుపుతున్న సూరవరపు దశవంత్, అతడి స్నేహితుడు ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ నమవరంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు. ఘటనకు ముందు వీరిద్దరూ విపరీతంగా మద్యం సేవించి సినిమా చూసేందుకు మాల్‌కు వచ్చారు. అయితే మద్యం మత్తులో ఉన్నారనే కారణంతో మాల్ సిబ్బంది వారిని లోనికి అనుమతించలేదు. సిబ్బందితో దురుసుగా ప్రవర్తించిన నిందితులు, ఆ కోపంతో బయటకు వచ్చి బయటకు వెళ్తున్న వైద్య విద్యార్థినుల స్కూటీని కారుతో తొక్కి పరారయ్యారు. నిందితులపై హత్యాయత్నం కేసుతో పాటు, మాల్ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించినందుకు ప్రత్యేక కేసు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు.

Epaper: epaper.vaartha.com

లోయర్ ట్యాంక్ బండ్ వద్ద చెత్తకుండీలో సగం కాలిన శవం కలకలం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha