Hyderabad lower tank bund:హైదరాబాద్ నగరంలోని లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతంలో గురువారం నాడు ఓ చెత్తకుండీలో సగభాగం కాలిపోయిన మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.
వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో దోమలగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా మారడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Read also: Atiq Ahmed Son Dies: రోడ్డు ప్రమాదంలో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ చిన్న కుమారుడు దుర్మరణం
Atrocity at Lower Tank Bund
హత్య చేసి నిప్పు పెట్టిన వైనం
వేరే ప్రాంతంలో ఈ మహిళను హత్య చేసి ఆనవాళ్లు లేకుండా చేసేందుకు దుండగులు ఈ ప్రాంతానికి తీసుకువచ్చి పడవేసినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతదేహంపై పెట్రోల్ లేదా ఇతర ఇంధనం పోసి నిప్పు పెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనే క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తూ లోతుగా విచారణ జరుపుతోంది.
Hyderabad lower tank bund:సీసీటీవీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు
ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి నిజాలు నిగ్గు తేల్చేందుకు చుట్టుపక్కల ప్రాంతాల సీసీటీవీ పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మహిళ మృతికి అసలు కారణాలు స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. దోమలగూడ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Epaper: epaper.vaartha.com
ఘోర రోడ్డు ప్రమాదం: కారును ఢీకొట్టిన డీసీఎం.. తల్లి, కొడుకు దుర్మరణం!

