Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అవకతవకలకు పాల్పడుతున్న అంగన్వాడి టీచర్ ను సస్పెండ్ చేయాలి

అవకతవకలకు పాల్పడుతున్న అంగన్వాడి టీచర్ ను సస్పెండ్ చేయాలి

వార్త 1 month ago

Shivampet Anganwadi: శివ్వంపేటలో, అవకతవకలకు పాల్పడుతున్న అంగన్వాడీ టీచర్ ను సస్పెండ్ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. వివరాల్లోకెళ్తే మండలంలోని చిన్న గొట్టుముక్కల లో మంగళవారం అంగన్వాడి టీచర్ విమల అంగన్వాడీ కేంద్రంలో ఉన్న సరుకులను తన కారులో గుడ్లు, పప్పులు, నూనె, పాలు తరలిస్తుండగా గ్రామ ప్రజలు కారును అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా అంగన్వాడీ టీచర్ గ్రామంలోని గర్భిణీలకు, పిల్లలకు ప్రభుత్వం అందజేస్తున్న గుడ్లు, పాలు, పప్పులు ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రతి నెల అంగన్వాడి కేంద్రంలో ఉన్న సరుకులను ఇంటి వద్దకు తీసుకెళ్తుందని అవకతవకలకు పాల్పడుతున్న అంగన్వాడి టీచర్ను వెంటనే సస్పెండ్ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

Read Also:Bhu Bharathi : 'భూ భారతి' డౌన్ తో తెలంగాణ వ్యాప్తంగా నిలిచిన రిజిస్ట్రేషన్లు

 కార్లో అంగన్వాడి సర్కులను తరలిస్తున్న దృశ్యం

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

అక్రమ మైనింగ్‌పై హైడ్రా ఉక్కుపాదం.. ఏకకాలంలో ఆరు చోట్ల ఆకస్మిక దాడులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha