Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అవమానించిన చోటే విజయ్ ప్రమాణ స్వీకారం..ఇది కదా అసలైన సీన్ !!

అవమానించిన చోటే విజయ్ ప్రమాణ స్వీకారం..ఇది కదా అసలైన సీన్ !!

వార్త 2 weeks ago

2013వ సంవత్సరంలో భారతీయ సినిమా శతాబ్ది (వందేళ్ల) వేడుకలను చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. అప్పట్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అయితే, ఆ సమయంలో అగ్ర నటుడిగా ఉన్న విజయ్‌కు ప్రోటోకాల్ ప్రకారం దక్కాల్సిన గౌరవం దక్కలేదని, ఆయనను వెనుక వరుసలో కూర్చోబెట్టి అవమానించారని అభిమానులు అప్పట్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికపై స్టార్లందరినీ ఆహ్వానించినప్పుడు విజయ్‌ను విస్మరించడం చర్చనీయాంశమైంది. ఒక రకంగా ఆ రోజు ఆ స్టేడియంలో జరిగిన పరాభవమే విజయ్‌లో రాజకీయ స్ఫూర్తిని రగిల్చిందని నెటిజన్లు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు.

Read Also : ప్రొఫెషనల్ సీఎం గా విజయ్..ఫార్మల్ డ్రెస్సులో అదరగొట్టాడు !!

‘తలైవా’ టైటిల్ పోరు

విజయ్ మరియు అప్పటి ప్రభుత్వానికి మధ్య విభేదాలు రావడానికి ప్రధాన కారణం ఆయన నటించిన ‘తలైవా’ (Thalaivaa) సినిమా అని అప్పట్లో బలమైన రిపోర్ట్స్ వచ్చాయి. ఆ చిత్రానికి ‘Time to Lead’ అనే ట్యాగ్‌లైన్ ఉండటం, సినిమా టైటిల్ ‘నాయకుడు’ అనే అర్థం వచ్చేలా ఉండటంతో జయలలిత ప్రభుత్వం దీనిని సీరియస్‌గా తీసుకుంది. బాంబు బెదిరింపులు, థియేటర్ల సమస్యలతో ఆ సినిమా విడుదల తమిళనాడులో నిలిచిపోయింది. తన సినిమాను రిలీజ్ చేయించుకోవడానికి విజయ్ స్వయంగా ప్రయత్నించినా, అప్పటి ప్రభుత్వం నుంచి ఆయనకు ఆశించిన మద్దతు లభించలేదు. ఆ సమయంలో ఎదుర్కొన్న అడ్డంకులు, అవమానాలే విజయ్‌ను ప్రజల కోసం పనిచేసే నాయకుడిగా మార్చడానికి పునాది వేశాయని చెప్పవచ్చు.

అదే వేదిక.. అదే కుర్చీ: ఇది కదా అసలైన ‘రివెంజ్’ !

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అనడానికి విజయ్ ప్రమాణ స్వీకారమే నిదర్శనం. 2013లో ఎక్కడైతే ఆయనను వెనుక వరుసకు పరిమితం చేశారో, సరిగ్గా 13 ఏళ్ల తర్వాత అదే నెహ్రూ స్టేడియంలో మొదటి వరుసలో, అత్యున్నతమైన ముఖ్యమంత్రి పీఠంపై విజయ్ కూర్చోబోతున్నారు. “అవమానించిన చోటే అధికారం చేపట్టడం” అంటే ఇదేనంటూ సోషల్ మీడియాలో ‘దళపతి’ ఫ్యాన్స్ పోస్టులతో హోరెత్తిస్తున్నారు. జయలలిత వంటి బలమైన నాయకురాలిని ఎదిరించి నిలబడిన విజయ్, నేడు రాష్ట్ర ప్రజలందరికీ ‘తలైవా’ (నాయకుడు)గా మారారు. పాత గాయాలకు ఈ విజయం ఒక మందులా పనిచేస్తుందని, విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఇదొక చారిత్రాత్మక మలుపు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha