Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అవినాశ్‌పై బీటెక్ రవి ఫైర్.. సంచలన ఆరోపణలు

అవినాశ్‌పై బీటెక్ రవి ఫైర్.. సంచలన ఆరోపణలు

వార్త 2 weeks ago

Andhra Politics : బీటెక్ రవి, వైఎస్ అవినాశ్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తనను డబ్బుతో కొనుగోలు చేయాలని ప్రయత్నించారంటూ వచ్చిన ఆరోపణలకు ప్రతిస్పందిస్తూ బీటెక్ రవి మీడియా సమావేశంలో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను ఎలాంటి పరిస్థితుల్లోనూ డబ్బుకు లొంగే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. తనను, తన రాజకీయ ప్రయాణాన్ని డబ్బుతో ప్రభావితం చేయగలమని అనుకోవడం భ్రమ అని వ్యాఖ్యానించారు. అవినాశ్ రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్లను ప్రస్తావిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

వివేకా కేసు, అమరావతి అంశాలపై ఆరోపణలు

బీటెక్ రవి మాట్లాడుతూ అమరావతికి మద్దతుగా నిలవకుండా ఉండేందుకు భారీ మొత్తంలో డబ్బు ఆఫర్ చేశారని ఆరోపించారు. అలాగే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు వెనక్కి తీసుకునేందుకు బ్లాంక్ చెక్కులు ఇవ్వాలని ప్రయత్నించారని కూడా వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అసంతృప్త నాయకుల వివరాలు అందించిన విషయం సహా పలు రాజకీయ పరిణామాలపై కూడా ఆయన సంచలన ఆరోపణలు చేశారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలను ప్రస్తావిస్తూ అవినాశ్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Read Also : ఎంఎస్ఎంఈలకు గ్లోబల్ మార్కెట్.. మెటా, అమెజాన్‌తో ఏపీ ఒప్పందాలు

 Andhra Politics

రాజకీయ సవాల్ విసిరిన బీటెక్ రవి

ఎర్రచందనం అక్రమ రవాణాతో సంబంధాలున్నాయంటూ కూడా బీటెక్ రవి ఆరోపణలు చేశారు. కొన్ని పోలీసు అధికారుల పేర్లను ప్రస్తావిస్తూ మరిన్ని విషయాలు బయటకు వస్తాయని హెచ్చరించారు.

చివరగా అవినాశ్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరిన ఆయన, తాను చెప్పిన విషయాలు తప్పని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని అన్నారు. ఇప్పటివరకు మొదటి భాగమే చూసారని, ఇంకా మరిన్ని విషయాలు బయటపెడతానంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

జనసేన లో శత్రువులు ఉన్నారు..బాంబ్ పేల్చిన పవన్ కళ్యాణ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha