Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జనసేన లో శత్రువులు ఉన్నారు..బాంబ్ పేల్చిన పవన్ కళ్యాణ్

జనసేన లో శత్రువులు ఉన్నారు..బాంబ్ పేల్చిన పవన్ కళ్యాణ్

వార్త 3 months ago

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీలోని అంతర్గత శత్రువులను ఉద్దేశిస్తూ అత్యంత సంచలన వ్యాఖ్యలు చేశారు. 'శత్రువులు ఎక్కడో బయట లేరని, మన పార్టీలోనే దాగి ఉన్నారంటూ' ఆయన పెద్ద బాంబు పేల్చారు.

ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తాను జరిపిన అత్యంత రహస్యమైన, వ్యక్తిగత చర్చల వివరాలు బయటి వ్యక్తులకు ఎలా తెలిశాయంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలోని కొందరు వ్యక్తులే ఈ సమాచారాన్ని బయటకు లీక్ చేస్తున్నారనే కోణంలో పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు జనసేన పార్టీ వర్గాలతో పాటు ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. తన అంతర్గత సమావేశాల వివరాలు ప్రత్యర్థుల చేతుల్లోకి వెళ్లడంపై ఆయన తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు.

Read Also : ఎంఎస్ఎంఈలకు గ్లోబల్ మార్కెట్.. మెటా, అమెజాన్‌తో ఏపీ ఒప్పందాలు

వైసీపీ నాయకుడి జైలు వ్యవహారం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్లాలని తాను అమిత్ షాను కోరినట్లు వస్తున్న విమర్శలను పవన్ కళ్యాణ్ పూర్తిగా కొట్టిపారేశారు. “వైసీపీ నాయకుడు జైలుకు వెళ్లాలని నేనెందుకు కోరుకుంటాను? ఒకవేళ ఆయన జైలుకు వెళ్తే జనసేన పార్టీ ఏమైనా అద్భుతంగా ఎదుగుతుందా?” అని ఆయన ప్రశ్నించారు. దేశ కేంద్ర హోంమంత్రితో భేటీ అయినప్పుడు ఇలాంటి చౌకబారు రాజకీయాల గురించి మాట్లాడతామా అని మండిపడ్డారు. ఇలాంటి ప్రచారాలు చేయడం దేశ అత్యున్నత రక్షణ, పాలనా వ్యవస్థలను అవమానించడమేనని ఆయన స్పష్టం చేశారు. తాను అమిత్ షాను కలిసింది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి మరియు కేంద్ర నిధుల కోసమేనని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా బలంగా పునరుద్ఘాటించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

గొడ్డలి పార్టీకి ప్రజలే గట్టి షాక్ ఇచ్చారు అచ్చెన్నాయుడు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha