మెటా, అమెజాన్‌తో ఏపీ ప్రభుత్వ కీలక ఒప్పందాలు
AP MSME : ఆంధ్రప్రదేశ్‌లో ఎంఎస్ఎంఈ రంగాన్ని ప్రపంచ మార్కెట్‌కు అనుసంధానం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది.
ముఖ్యమంత్రి N. Chandrababu Naidu సమక్షంలో Meta, Amazon, Zoho సంస్థలతో ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఒప్పందాలు కుదుర్చుకుంది. గ్రామీణ ఉత్పత్తులను గ్లోబల్ మార్కెట్‌కు చేర్చడమే ఈ ఒప్పందాల ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది.
జెన్-జీ యువత కలలకు ప్రభుత్వం భరోసా
విజయవాడలో జరిగిన "ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026"లో పాల్గొన్న చంద్రబాబు.. జెన్-జీ, జెన్-ఆల్ఫా యువత కోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. "విలేజ్ టు గ్లోబల్ మార్కెట్" లక్ష్యంతో గ్రామీణ ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలని ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
38 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు శ్రీకారం
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 38 కొత్త ఎంఎస్ఎంఈ పారిశ్రామిక పార్కులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అలాగే రూ.200 కోట్లతో "ఏపీ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్", రూ.300 కోట్లతో "చీఫ్ మినిస్టర్స్ ఎంట్రప్రెన్యూర్ ప్రోగ్రామ్"ను ప్రారంభించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేయడమే లక్ష్యమని సీఎం తెలిపారు.
100 యూనికార్న్ కంపెనీలే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్‌ను ఇన్నోవేషన్ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రం నుంచి 100 యూనికార్న్ కంపెనీలు రావాలనే లక్ష్యంతో స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు. డీప్ టెక్ స్టార్టప్‌ల కోసం సిడ్బీతో కలిసి రూ.20 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read also : Ambati Comments : లోకేష్ పై అంబటి ఫైర్
AP MSMEఎంఎస్ఎంఈలకు ప్రభుత్వ పూర్తి మద్దతు
వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి అవకాశాలు కల్పించే రంగం ఎంఎస్ఎంఈలేనని సీఎం అన్నారు. ఇప్పటికే రూ.558 కోట్ల ప్రోత్సాహకాలు అందించామని, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు ఇస్తున్నామని తెలిపారు. త్వరలో 5 లక్షల మంది డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
కార్యకర్తలకు గుర్తింపు ఇస్తాం.. జూమ్ కాన్ఫరెన్స్‌లో లోకేష్ భరోసా!

