Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అయ్యర్‌ను పక్కన పెట్టకండి.. కావాలంటే అతడిని తీసేయండి!

అయ్యర్‌ను పక్కన పెట్టకండి.. కావాలంటే అతడిని తీసేయండి!

వార్త 3 months ago

Virender Sehwag on RCB: ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు మేనేజ్‌మెంట్‌కు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఒక కీలకమైన సలహా ఇచ్చాడు.

ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్‌ను తుది జట్టు (Playing XI) నుంచి ఎలాంటి పరిస్థితుల్లోనూ తొలగించవద్దని ఆయన సూచించాడు. ఈ సీజన్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా జట్టులోకి వస్తున్న వెంకటేష్ అయ్యర్ అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగ్‌లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన మ్యాచ్‌లో ఒత్తిడిలోనూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీకి ఒంటరి చేత్తో విజయాన్ని అందించాడు.

Read Also:SRH vs RCB IPL 2026: ఇదేం బౌలింగ్ భయ్యా? కృనాల్ పాండ్య వింత యాక్షన్‌పై కావ్య మారన్ ఫైర్!

Virender Sehwag on RCB: సెహ్వాగ్ ఏమన్నాడంటే..?

 Venkatesh Iyer RCB

గాయం నుంచి కోలుకున్న విదేశీ స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ మళ్లీ అందుబాటులోకి రావడంతో, ఇప్పుడు ఆర్సీబీ తుది జట్టు ఎంపికలో సందిగ్ధత నెలకొంది. సాల్ట్‌ను జట్టులోకి తీసుకువస్తే ఫామ్‌లో ఉన్న అయ్యర్‌ను పక్కన పెట్టాలనే ఆలోచనలో మేనేజ్‌మెంట్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. “వెంకటేష్ అయ్యర్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. మ్యాచ్‌లను గెలిపిస్తున్న ప్లేయర్‌ను బెంచ్‌కే పరిమితం చేయడం సరికాదు. ఒకవేళ ఫిల్ సాల్ట్‌ను ఖచ్చితంగా ఆడించాలనుకుంటే.. ప్రస్తుతానికి ఫామ్‌లో లేని వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మను పక్కన పెట్టండి. అంతే తప్ప అద్భుతంగా రాణిస్తున్న అయ్యర్‌ను మాత్రం టచ్ చేయకండి” అని సెహ్వాగ్ ఆర్సీబీ యాజమాన్యానికి గట్టిగా సూచించాడు. రాబోయే మ్యాచ్‌ల్లో ఆర్సీబీ కాంబినేషన్ ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సెహ్వాగ్ సూచించినట్లు మేనేజ్‌మెంట్ జితేశ్ శర్మపై వేటు వేసి అయ్యర్‌కు అవకాశం ఇస్తుందో లేదో చూడాలి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

తనను కలవలేదని ఏడ్చిన యువతి.. అభిమానికి సారీ చెప్పిన రోహిత్ శర్మ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha