SRH vs RCB IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా RCB, SRH మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక విచిత్రమైన సన్నివేశం చోటుచేసుకుంది.
ఆర్‌సీబీ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్య విసిరిన వింత బౌలింగ్ డెలివరీలపై ఎస్‌ఆర్‌హెచ్ యజమాని కావ్య మారన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది..
ఈ హోరాహోరీ పోరులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు హోమ్ గ్రౌండ్‌లో చెలరేగిపోయారు. ఓపెనర్లు ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్‌లతో పాటు అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆర్‌సీబీ బౌలర్లను చీల్చిచెండూడారు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచింది. అయితే ఈ ఇన్నింగ్స్ సాగుతున్న సమయంలో కృనాల్ పాండ్య వేసిన కొన్ని బంతులు మ్యాచ్‌లోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Is this bowling? Kavya Maran fires at Krunal Pandya’s strange action!
SRH vs RCB IPL 2026: సాధారణంగా కృనాల్ పాండ్య లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ అయినప్పటికీ, అప్పుడప్పుడు బ్యాటర్లను అయోమయానికి గురి చేయడానికి విచిత్రమైన యాక్షన్‌తో బౌలింగ్ చేస్తుంటాడు. ఈ మ్యాచ్‌లో కూడా కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన కృనాల్, స్పిన్ వేయాల్సింది పోయి ఏకంగా నాలుగు నుంచి ఆరు బౌన్సర్లు విసిరాడు. ఒక స్పిన్ బౌలర్ అంత దగ్గరి నుంచి ప్రమాదకరమైన రీతిలో బౌన్సర్లు వేయడం చూసి క్రీజులో ఉన్న ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లతో పాటు ఆర్‌సీబీ వికెట్ కీపర్ జితేష్ శర్మ కూడా ఇబ్బంది పడ్డారు. ఈ వింత బౌలింగ్ యాక్షన్‌ను స్టాండ్స్ నుంచి గమనిస్తున్న సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ ఒక్కసారిగా తీవ్ర అసహనానికి లోనయ్యారు. తన పక్కన ఉన్న వారితో "అసలు ఏం బౌలింగ్ చేస్తున్నాడు ఇతను? ఇది నిబంధనలకు విరుద్ధం కదా" అనే అర్థం వచ్చేలా చేతులూపుతూ అసంతృప్తిని వెళ్లగక్కారు.
55 పరుగుల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్ విజయం
ఆ తర్వాత 256 పరుగుల భారీ లక్ష్య చేదనతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టుకు ఆరంభంలోనే గట్టి షాక్‌లు తగిలాయి. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ పవర్‌ప్లేలోనే వెనుతిరగడంతో ఆర్‌సీబీ కష్టాల్లో పడింది. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్‌లో రజత్ పటిదార్, కృనాల్ పాండ్య, టిమ్ డేవిడ్ కాసేపు పోరాడినప్పటికీ లాభం లేకపోయింది. నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి ఆర్‌సీబీ 200 పరుగులకే పరిమితం కావడంతో, సన్‌రైజర్స్ హైదరాబాద్ 55 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని అందుకుని పాయింట్ల పట్టికలో దూసుకెళ్లింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
తనను కలవలేదని ఏడ్చిన యువతి.. అభిమానికి సారీ చెప్పిన రోహిత్ శర్మ

