Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తనను కలవలేదని ఏడ్చిన యువతి.. అభిమానికి సారీ చెప్పిన రోహిత్ శర్మ

తనను కలవలేదని ఏడ్చిన యువతి.. అభిమానికి సారీ చెప్పిన రోహిత్ శర్మ

వార్త 1 day ago

Rohit Sharma: టీమిండియా స్టార్ క్రికెటర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మైదానంలోనే కాదు, బయట కూడా తనకు ఎందుకు అంతలా అభిమానులు ఉంటారో మరోసారి నిరూపించుకున్నాడు.

తనను కలవలేకపోయానని ఆవేదనతో ఓ యువతి కన్నీళ్లు పెట్టుకున్న వీడియోను చూసి రోహిత్ శర్మ చలించిపోయాడు. ఆ అభిమాని బాధను అర్థం చేసుకుని, ఆమెకు క్షమాపణలు చెబుతూ ప్రత్యేకంగా ఒక వీడియో సందేశాన్ని పంపించాడు. అంతేకాదు, వచ్చేసారి కోల్‌కతా వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తానని ప్రామిస్ చేసి ఆ యువతిని ఆనందంలో ముంచెత్తాడు.

అసలేం జరిగిందంటే..!

ఇటీవల కోల్‌కతాలోని ఐకానిక్ స్టేడియం ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కోసం వచ్చిన రోహిత్ శర్మను ఎలాగైనా కలవాలనే ఆశతో జినియా అనే యువతి స్టేడియానికి వచ్చింది. తన అభిమాన క్రికెటర్‌ను ఒక్కసారైనా చూడటం, కలవడం తన జీవితకాల కల అని భావించిన ఆమె.. మ్యాచ్ ముగిశాక గంటల తరబడి అక్కడే ఎదురుచూసింది.

డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఆటగాళ్లు బయటకు వస్తున్న సమయంలో, రోహిత్‌ను చూడగానే ఆమె ఉద్వేగంతో ‘రోహిత్ భాయ్’ అంటూ గట్టిగా అరిచింది. అయితే, స్టేడియం వద్ద ఉన్న వందలాది మంది అభిమానుల అరుపులు, సందడి మధ్య ఆమె పిలుపును రోహిత్ గమనించలేకపోయాడు. నేరుగా ముందుకు వెళ్లిపోయాడు. దీంతో తన కల నెరవేరలేదని తీవ్ర నిరాశకు గురైన ఆ యువతి అక్కడే కన్నీరు పెట్టుకుంది. ఈ ఎమోషనల్ దృశ్యాన్ని ఆమె బంధువు ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.

Rohit Sharma: “నన్ను క్షమించు జినియా.. వచ్చేసారి పక్కా కలుస్తా”

రోహిత్ శర్మ వీడియో సందేశంలో “హాయ్ జినియా! నిన్ను ఈడెన్ గార్డెన్స్‌లో కలవలేకపోయినందుకు నన్ను క్షమించు. సోషల్ మీడియాలో నీ వీడియో చూశాక నాకూ చాలా బాధేసింది. కొన్నిసార్లు మ్యాచ్ ముగిశాక అభిమానుల రద్దీ, శబ్దాల మధ్య ఎవరు పిలుస్తున్నారో.. ఎటు వైపు నుంచి పిలుస్తున్నారో గుర్తించడం చాలా కష్టమవుతుంది. నా పరిస్థితిని అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను. వచ్చేసారి నేను కోల్‌కతా వచ్చినప్పుడు నిన్ను తప్పకుండా కలుస్తాను” అని రోహిత్ హామీ ఇచ్చాడు. స్టార్ క్రికెటర్ అయ్యుండి కూడా ఒక సామాన్య అభిమాని కోసం ఇంతలా స్పందించి, స్వయంగా వీడియో మెసేజ్ పంపడంతో రోహిత్ శర్మపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అటు రోహిత్ భాయ్ నుంచి ఊహించని సర్ప్రైజ్ రావడంతో సదరు యువతి జినియా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha