Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అయ్యో ఎంత పని జరిగింది.. విద్యుత్‌ షాక్‌తో 9 నెలల చిన్నారి మృతి

అయ్యో ఎంత పని జరిగింది.. విద్యుత్‌ షాక్‌తో 9 నెలల చిన్నారి మృతి

వార్త 1 week ago

Khammam News: ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం చిన్న మునగాల గ్రామంలో గుండెలను పిండేసే తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇల్లెందుల రమేష్, మమత దంపతుల తొమ్మిది నెలల కుమారుడు అవేద్ ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

కురిసిన వర్షం కారణంగా ఇంటి ఆవరణలోని ఎర్త్ పైపుపై బిగించిన స్టీల్ ప్లేట్‌కు విద్యుత్ సరఫరా అయినట్లు తెలుస్తోంది. పసిబాలుడు ఆడుకుంటూ వెళ్లి ఆ ప్రమాదకర స్టీల్ ప్లేట్‌ను పట్టుకోవడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

Read Also : Mulugu Road Accident: ములుగు జిల్లాలో బస్సు-బొలెరో ఢీ.. 15 మందికి తీవ్ర గాయాలు

 Tragedy strikes: 9-month-old infant dies of electric shock.

Khammam News: ఆసుపత్రికి తరలించినా దక్కని ప్రాణాలు

బాలుడు కుప్పకూలడం గమనించిన తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనతో వెంటనే చిన్నారిని చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే బాలుడిని పరీక్షించిన వైద్యులు, అతడు ఆసుపత్రికి తీసుకురావడానికి ముందే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అప్పటివరకు కళ్లముందే అల్లారుముద్దుగా తిరుగుతూ ఆడుకున్న కంటిపాప మృత్యువాత పడటాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు.

చేతికందుతాడనుకున్న తొమ్మిది నెలల పసికందు విద్యుత్ షాక్ రూపంలో మరణించడంతో చిన్న మునగాల గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. కళ్లెదుటే కుమారుడు ప్రాణాలు విడడవంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి గుండెలవిసే రోదనలు స్థానికులను, గ్రామస్థులను తీవ్రంగా కలచివేశాయి.

గణేష్ నిమజ్జన శోభాయాత్రలో విషాదం.. ట్రక్ కింద పడి యువకుడు మృతి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha