- బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిని హౌస్ అరెస్టు చేయడం ఏంటి..
- బిజెపి రాష్ట్ర కార్యదర్శి పోతుగంటి భరత్ ప్రసాద్
Pothuganti bharath prasad:దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి… కానీ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడినే హౌస్ అరెస్ట్ చేస్తారా ?
అంటూ బిజెపి రాష్ట్ర కార్యదర్శి పోతుగంటి భరత్ ప్రసాద్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు డా. వర్షిత్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావును హౌస్ అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నట్లు బిజెపి రాష్ట్ర కార్యదర్శి పోతుగంటి భరత్ ప్రసాద్ తెలిపారు.
Read also: Wrong route driving: రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తే ఫోన్ కు చలానా!
Pothuganti Bharat Prasad expresses extreme anger.
Pothuganti bharath prasad:పోతుగంటి భరత్ ప్రసాద్ తీవ్ర ఆగ్రహం
దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్ష నాయకులను పోలీసులతో అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అన్నారు. హౌస్ అరెస్ట్‌లతో బీజేపీని ఆపలేరని,
కార్యకర్తలకు అండగా, న్యాయం కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Epaper: epaper.vaartha.com

