Dailyhunt
బాలయ్య తొడకొడితే వైసీపీ వాళ్లు ఒక్కరు కూడా మిగలరు - లోకేశ్ కీలక వ్యాఖ్యలు

బాలయ్య తొడకొడితే వైసీపీ వాళ్లు ఒక్కరు కూడా మిగలరు - లోకేశ్ కీలక వ్యాఖ్యలు

వార్త 1 week ago

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విమర్శల పర్వం తారస్థాయికి చేరుకుంది. వైసీపీ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

ముఖ్యంగా హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణ గురించి లోకేశ్ చేసిన వ్యాఖ్యలు కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. వైసీపీ అరాచక పాలనకు అంతం పలికేది పసుపు సైన్యమేనని లోకేశ్ నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా తన మామ బాలకృష్ణ గురించి ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “బాలయ్య బాబు అందరికీ హీరో అయితే, నాకు ముద్దుల మావయ్య. ఆయన సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ పవర్‌ఫుల్. ఆయన ఒక్కసారి తొడకొట్టి రంగంలోకి దిగితే వైసీపీ నాయకులు ఒక్కరు కూడా మిగలరు” అంటూ ఘాటుగా హెచ్చరించారు. వైసీపీ నేతల అహంకారానికి కాలం దగ్గర పడిందని, ప్రజలే వారికి తగిన గుణపాఠం చెబుతారని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు.

Read Also : MI vs SRH Toss Live Update: టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్

అభివృద్ధి వర్సెస్ అహంకారం – జగన్ పాలనపై విమర్శలు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరిని లోకేశ్ తీవ్రంగా తప్పుపట్టారు. అహంకారం తలకెక్కితే మనిషి ఏ స్థాయికి దిగజారుతారో చెప్పడానికి జగన్ ఒక ఉదాహరణ అని విమర్శించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తూ.. ఏపీకి సుమారు 800 భారీ ప్రాజెక్టులను తీసుకువచ్చామని, 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇచ్చి నిరుద్యోగులకు అండగా నిలిచామని గుర్తు చేశారు. కానీ నేడు రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, కేవలం రాజకీయ కక్షసాధింపులే ధ్యేయంగా పాలన సాగుతోందని లోకేశ్ ఆరోపించారు.

పసుపు జెండా రెపరెపలు- గెలుపే లక్ష్యంగా కార్యచరణ

వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధిస్తుందని లోకేశ్ విశ్వాసం వ్యక్తం చేశారు. అభివృద్ధి కంటే అరాచకాలకే పెద్దపీట వేస్తున్న వైసీపీకి ప్రజలు ఎండ్ కార్డ్ వేయడం ఖాయమని జోస్యం చెప్పారు. కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదని, అండగా తామున్నామని హామీ ఇచ్చారు. నిరుద్యోగుల భవిష్యత్తు కోసం, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం మళ్ళీ సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని ప్రజలను కోరారు. లోకేశ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

తండ్రికి విలువ ఇవ్వని మనిషి.. తల్లి ఎలా అవుతుంది?.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha