Kagaznagar Girls Gurukul: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో విద్యార్థినుల మధ్య జరిగిన ఒక భయంకరమైన ర్యాగింగ్ ఉదంతం కలకలం రేపుతోంది. కాగజ్‌నగర్ మండలం దరిగాం రోడ్డులోని మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థినిపై తోటి విద్యార్థినులే అత్యంత అమానుషంగా ప్రవర్తించారు.
ఈ ర్యాగింగ్ ఘటనతో సదరు బాధితురాలు తీవ్ర అస్వస్థతకు గురికావడం స్థానికంగా పెద్ద దుమారం రేపుతోంది.
పాఠశాల హాస్టల్‌లో పదో తరగతి చదువుతున్న ఉషాన్ శృతి అనే విద్యార్థినిని తోటి విద్యార్థినులు కొందరు కలిసి టార్గెట్ చేశారు. పథకం ప్రకారం శృతి కళ్లకు గంతలు కట్టి, ఆమె కదలకుండా కాళ్లు, చేతులను బలంగా గట్టిగా పట్టుకున్నారు. అంతటితో ఆగకుండా, ఆమె నోట్లో పెన్ను క్యాప్ వేసి, అది లోపలికి వెళ్లేలా బలవంతంగా నీళ్లు పోసి మింగించారు. తోటి విద్యార్థినుల అనాగరిక, అమానుష చర్యతో బాధితురాలు ఊపిరాడక తీవ్ర భయాందోళనకు గురైంది.
Read Also : Sri Lankan prison: శ్రీలంక జైల్లో డ్రగ్స్ గ్యాంగ్‌ల వీరంగం - ఘర్షణల్లో 25 మంది మృతి
Fellow students forced a girl to swallow a pen cap… what happened in the end?
Kagaznagar Girls Gurukul: కడుపులో పెన్ను క్యాప్.. చికిత్స చేసి తీసిన వైద్యులు
ఈ ఘటన తర్వాత బాలిక తీవ్ర కడుపునొప్పితో అస్వస్థతకు గురికావడంతో వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితురాలికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు, స్కానింగ్ చేయగా కడుపులో పెన్ను క్యాప్ ఉన్నట్లు స్పష్టంగా గుర్తించారు. అనంతరం వైద్యులు అత్యవసరంగా చికిత్స అందించి, శృతి కడుపులో ఉన్న పెన్ను క్యాప్‌ను సురక్షితంగా బయటకు తీశారు. ప్రస్తుతం బాలిక వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటోంది.
గురుకుల పాఠశాలలో క్రమశిక్షణతో చదువుకోవాల్సిన విద్యార్థినులు, తోటి బాలికపై ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టడంపై బాధితురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ భయంకరమైన ర్యాగింగ్ ఉదంతంపై బాధితురాలు ఉషాన్ శృతి తండ్రి కాగజ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధ్యులైన విద్యార్థినులపై, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.

