CM Basara Visit: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోమవారం నిర్మల్ జిల్లాలోని బాసర క్షేత్రాన్ని సందర్శించారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయన, జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో తన మనవడికి అక్షరాభ్యాసం చేయించారు. ఈ వేడుకలో రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ మరియు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Also:Telangana Irrigation Department: నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం
CM Basara Visit: బాసర క్షేత్ర పునర్నిర్మాణానికి శ్రీకారం

అమ్మవారి దర్శనం అనంతరం బాసర ఆలయ విస్తరణ మరియు సమగ్ర అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు. యాదాద్రి తరహాలో బాసరను కూడా ఆధ్యాత్మికంగా, పర్యాటక పరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. భక్తులకు అవసరమైన వసతులు, ఆలయ ప్రాంగణ విస్తరణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎం రేవంత్ రెడ్డికి వేదాశీర్వచనం అందించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
గచ్చీబౌలి స్టేడియంలో హెలిప్యాడ్.. ఒలింపిక్స్ లెవల్లో సీఎం రేవంత్ ప్లాన్

