CM Revanth Sports Hub Meeting: హైదరాబాద్‌ను దేశపు క్రీడా రాజధానిగా మార్చే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో భారీ అడుగు వేశారు. గచ్చీబౌలి స్టేడియాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలతో 'తెలంగాణ స్పోర్ట్స్ హబ్'గా తీర్చిదిద్దేందుకు సంబంధించి నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశం ఇప్పుడు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ముఖ్యంగా సంజీవ్ గోయెంకా, ఉపాసన కొణిదెల, కావ్య మారన్ వంటి ప్రముఖులు ఈ బోర్డులో సభ్యులుగా ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Also:CSK Performance IPL 2026: చెన్నైకు 'ఇదేం ఖర్మ'.. ఐదుసార్లు ఛాంపియన్ల పరిస్థితి పాతాళానికి
CM Revanth Sports Hub Meeting: ముఖ్య పరిణామాలు – సమావేశ విశేషాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ స్పోర్ట్స్ హబ్ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో గచ్చీబౌలి స్టేడియం రూపురేఖలను మార్చేలా పలు సూచనలు చేశారు.స్పోర్ట్స్ హబ్ చైర్మన్‌గా సంజీవ్ గోయెంకా, కో-చైర్మన్‌గా ఉపాసన కొణిదెల, సభ్యురాలిగా కావ్య మారన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరికి స్టేడియం అభివృద్ధిపై సీఎం పూర్తి స్వేచ్ఛనిచ్చారు.జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
చైనాలోని క్రీడా సౌకర్యాలను మించేలా ఇక్కడ ఏర్పాట్లు ఉండాలని, భవిష్యత్తులో ఒలింపిక్స్ నిర్వహించే స్థాయికి హైదరాబాద్ ఎదగాలని సీఎం ఆకాంక్షించారు.క్రీడాకారులు విమానాశ్రయం నుండి నేరుగా స్టేడియానికి చేరుకునేలా ప్రత్యేక హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.గచ్చీబౌలిలోని లక్షలాది మంది ఐటీ ఉద్యోగులను ఆకర్షించేలా స్టేడియంలో భారీ డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఆర్థిక స్వయం సమృద్ధి
స్టేడియం నిర్వహణకు భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా, ఆదాయాన్ని సమకూర్చుకునే మార్గాలతో కూడిన ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను సీఎం కోరారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం ఒక ప్రత్యేక ఆర్కిటెక్ట్‌ను నియమించినట్లు వెల్లడించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

