Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బడి పిలుస్తోంది.భవిష్యత్తును తీర్చిదిద్దే పిలుపు.. ఎంఈఓ విజయకుమారి

బడి పిలుస్తోంది.భవిష్యత్తును తీర్చిదిద్దే పిలుపు.. ఎంఈఓ విజయకుమారి

వార్త 5 days ago

Kalyandurgam: 'బడి పిలుస్తోంది' అనేది కేవలం ఒక నినాదం మాత్రమే కాదని, ప్రతి చిన్నారి విద్య హక్కును గుర్తు చేసే సామాజిక సందేశమని, పాఠశాల వయస్సు గల ప్రతి బాలబాలిక విద్యకు దూరం కాకుండా చూడాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం విద్యా వికాసానికి మార్గదర్శకంగా నిలుస్తోందని కళ్యాణ్ దుర్గం మండల విద్యాశాఖ అధికారి విజయకుమారి పేర్కొన్నారు..

సోమ వారం కళ్యాణదుర్గం మండలంలోని చాపిరి ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన “బడి పిలుస్తోంది” కార్యక్రమానికి మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) శ్రీమతి విజయకుమారి హాజరై తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను వివరించారు.

Read Also: South Coast Railway Zone: విశాఖ రైల్వే జోన్ సాకారం.. ఇచ్చాపురంలో ప్రారంభించిన మంత్రి రామ్మోహన్ నాయుడు!

Kalyandurgam: ప్రభుత్వ పాఠశాలల్లో వసతులపై అవగాహన

ప్రవేశాల నమోదు (ఎన్‌రోల్మెంట్) కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ సమావేశంలో ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం, డిజిటల్ బోధన, మౌలిక వసతులు వంటి అనేక సౌకర్యాలు అందు బాటులో ఉన్నాయని ఆమె వివరించారు. విద్యా ర్థుల మేధో, సామాజిక, నైతిక అభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలలు సమర్థవంతమైన వేదికలుగా మారుతున్నా యని పేర్కొన్నారు. సుమారు పదిమంది విద్యార్థుల తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడిన ఎంఈఓ విజయకుమారి, పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెరగడం అనేది కేవలం విద్యాశాఖ బాధ్యత మాత్రమే కాకుండా సమాజం మొత్తం బాధ్యత అని ఆమె అన్నారు.

కార్యక్రమ ప్రధాన ఉద్దేశాలు

“బడి పిలుస్తోంది” అనే నినాదం ప్రతి ఇంటికి విద్యా ప్రాముఖ్య తను చాటుతోంది. పాఠశాల మానేసిన పిల్లలను తిరిగి విద్యాబాట పట్టించడం, పాఠశాల వయస్సు పిల్లలందరినీ బడిలో చేర్పించడం, విద్య ద్వారా సమాజా భివృద్ధిని సాధించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపా ధ్యాయులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, సీఆర్‌ఎంటీలు, ఆశా వర్కర్లు పాల్గొని గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha