Dailyhunt
బైక్ అదుపుతప్పి ఇద్దరు యువకులు మృతి!

బైక్ అదుపుతప్పి ఇద్దరు యువకులు మృతి!

వార్త 1 week ago

Hyderabad Road Accident: హైదరాబాద్‌ శివార్లలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) సమీపంలోని హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డుపై జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.

Read Also:Mirzapur Lawyer Murder: రాజీవ్ సింగ్ దారుణ హత్య.. నడిరోడ్డుపై కాల్చిచంపిన దుండగులు

Hyderabad Road Accident: ప్రమాదం జరిగిన తీరు

పోలీసుల కథనం ప్రకారం.. పాతబస్తీకి చెందిన ఇద్దరు యువకులు తమ ద్విచక్ర వాహనంపై వేగంగా వెళ్తుండగా, హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డు వద్ద వాహనం ఒక్కసారిగా అదుపుతప్పింది.దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరూ కిందపడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

 Grisly road accident in Hyderabad

మృతులను పాతబస్తీకి చెందిన అబ్దుల్ సోహెద్ (20), షేక్ సాహిల్ (17)గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ ఎలక్ట్రీషియన్లుగా పనిచేస్తున్నారు. పని ముగించుకుని తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు.సమాచారం అందుకున్న వెంటనే రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల బాలుడు మృతి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha