Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాజీవ్ సింగ్ దారుణ హత్య.. నడిరోడ్డుపై కాల్చిచంపిన దుండగులు

రాజీవ్ సింగ్ దారుణ హత్య.. నడిరోడ్డుపై కాల్చిచంపిన దుండగులు

వార్త 2 months ago

Mirzapur Lawyer Murder: ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో రాజీవ్ సింగ్ (45) అనే న్యాయవాదిని దుండగులు అత్యంత కిరాతకంగా కాల్చిచంపారు. ప్రతిరోజూ లాగే ఈరోజు ఉదయం ఆయన మార్నింగ్ వాక్‌కు వెళ్లగా, అప్పటికే అక్కడ మాటు వేసిన ఇద్దరు దుండగులు రాజీవ్ సమీపానికి రాగానే అతి సమీపం నుండి నాటు తుపాకీతో కాల్పులు జరిపారు.

బుల్లెట్ తగలగానే ఆయన అక్కడికక్కడే కుప్పకూలి మరణించారు. ఈ దారుణ దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.

Read Also:Meerut in Uttar Pradesh: కన్నకూతురు శవంతో ఐదు నెలల సహవాసం: మేరఠ్‌లో వెలుగుచూసిన హృదయవిదారక ఘటన!

హత్య తర్వాత మొరాయించిన బైక్.. తుపాకీతో బెదిరించి పరారీ

హత్య చేసిన అనంతరం నిందితులు పారిపోయే క్రమంలో వారి బైక్ స్టార్ట్ కాక మొరాయించింది. ఒకరి తర్వాత ఒకరు బైక్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తుండగా, గమనించిన స్థానికులు వారిని పట్టుకోవడానికి ముందుకు వచ్చారు. అయితే, నిందితుల్లో ఒకడు తన వద్ద ఉన్న తుపాకీని చూపించి స్థానికులను బెదిరించడంతో వారు వెనుకంజ వేశారు. ఇంతలో బైక్ స్టార్ట్ అవ్వడంతో నిందితులిద్దరూ అక్కడి నుంచి వేగంగా పరారయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Mirzapur Lawyer Murder: రక్షణ కల్పించాలని ముందే కోరిన బాధితుడు

బాధాకరమైన విషయం ఏమిటంటే, తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనకు రక్షణ కల్పించాలని రాజీవ్ సింగ్ గతంలోనే పోలీసులకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. అయినప్పటికీ పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, ఈలోపే ఆయన హత్యకు గురవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

మహారాష్ట్ర హింగోలిలో భూకంపం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha