Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల బాలుడు మృతి!

స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల బాలుడు మృతి!

వార్త 2 months ago

Guntur School Bus Accident: గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం వరగాని గ్రామంలో శనివారం ఘోర ప్రమాదం సంభవించింది. స్థానిక శ్రీనివాస CBSE స్కూల్‌కు చెందిన బస్సు కింద పడి కూచపూడి కృప అన్వేష్ (4) అనే యూకేజీ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.

బస్సు ఎక్కుతున్న సమయంలోనో లేదా దిగిన తర్వాతో డ్రైవర్ అజాగ్రత్త వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. కళ్ల ముందే చిన్నారి విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Read Also:Mirzapur Lawyer Murder: రాజీవ్ సింగ్ దారుణ హత్య.. నడిరోడ్డుపై కాల్చిచంపిన దుండగులు

Guntur School Bus Accident: పరారీలో బస్సు డ్రైవర్.. కేసు నమోదు చేసిన పోలీసులు

 Four-Year-Old Boy Falls Victim to School Bus Driver’s Negligence; Accused Absconding.

ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ అక్కడి నుండి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంపై కూడా విచారణ జరుపుతామని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో వరగాని గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

డబ్బులు రాలేదని ఏకంగా ఏటీఎం మిషన్‌నే ఎత్తుకెళ్లారు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha