Byreddy Siddharth Reddy Case: రాయలసీమ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) యువ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మధ్య నడుస్తున్న మాటల యుద్ధం కాస్తా పోలీస్ స్టేషన్‌కు చేరింది.
ఇటీవల మే 14న కర్నూలు కలెక్టరేట్ ముట్టడి సందర్భంగా వైసీపీ చేపట్టిన నిరసన ప్రదర్శనలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అధికార పక్షంపై, ముఖ్యంగా మంత్రి టీజీ భరత్ మరియు ఆయన కుటుంబంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనను విమర్శించిన వారికి మంత్రి రివార్డులు ఇస్తున్నారని, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ బైరెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలోనే ఒక ఆత్మహత్య ఉదంతాన్ని ప్రస్తావిస్తూ ఫార్మా కంపెనీల లావాదేవీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Also:Yadagirigutta Cabinet Meeting: యాదగిరిగుట్టలో రేవంత్ రెడ్డి కేబినెట్ భేటీ.. కారణం ఇదేనా?
పరువునష్టం దావా వేసిన మంత్రి.. చట్టపరమైన చర్యలకు సిద్ధం
Defamation Case on Byreddy
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి టీజీ భరత్ తీవ్రంగా స్పందించారు. తన వ్యక్తిగత ప్రతిష్ఠను, తన కుటుంబ గౌరవాన్ని దెబ్బతీసేలా, సమాజంలో ద్వేషాన్ని రేకెత్తించేలా బైరెడ్డి ఉద్దేశపూర్వకంగానే అసత్య ఆరోపణలు చేశారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై బిఎన్ఎస్ (BNS) లోని పలు సెక్షన్ల కింద క్రిమినల్ పరువునష్టం కేసు నమోదు చేశారు. కేవలం క్రిమినల్ కేసుతోనే ఆగనని, త్వరలోనే బైరెడ్డిపై సివిల్ పరువునష్టం దావా కూడా వేస్తానని మంత్రి భరత్ స్పష్టం చేశారు.
Byreddy Siddharth Reddy Case: వేడెక్కిన రాయలసీమ రాజకీయం.. మున్ముందు ఏం జరగబోతోంది?
“నిజాలు మాట్లాడితే కేసులు పెడతారా?” అంటూ బైరెడ్డి వర్గం ప్రశ్నిస్తుండగా.. “ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే చట్టప్రకారం శిక్ష అనుభవించాల్సిందే” అంటూ మంత్రి వర్గం కౌంటర్ ఇస్తోంది. జిల్లాకు చెందిన ఇద్దరు కీలక యువ నేతల మధ్య లీగల్ అండ్ పొలిటికల్ వార్ మొదలవ్వడంతో కర్నూలు జిల్లా రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఈ లీగల్ ఫైట్ మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందోనని స్థానికంగా జోరుగా చర్చ సాగుతోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

