Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కిషన్ రెడ్డి భేటీ సక్సెస్.. మెట్రో ఫేజ్-2కు లైన్ క్లియర్!

కిషన్ రెడ్డి భేటీ సక్సెస్.. మెట్రో ఫేజ్-2కు లైన్ క్లియర్!

వార్త 3 months ago

Kishan Reddy Meets Manohar Lal: భాగ్యనగర వాసులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో తెలంగాణకు చెందిన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఈరోజు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో మెట్రో ఫేజ్-2 విస్తరణపై సానుకూల నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 50-50 శాతం వ్యయ భాగస్వామ్యంతో (ఈక్వల్ కాస్ట్ షేరింగ్) ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఖట్టర్ ప్రకటించారు.

Read Also :Telangana Cabinet meeting: తెలంగాణ కేబినెట్ భేటీ సడన్ గా వాయిదా.. అసలు కారణం ఇదేనా?

Kishan Reddy Meets Manohar Lal: డీపీఆర్ పరిశీలన పూర్తి కాగానే అధికారిక ప్రకటన!

 Central and state governments to share project costs on a 50-50 basis.

మెట్రో రెండో దశ నిర్మాణానికి సంబంధించి పెద్దగా సాంకేతిక పరమైన అడ్డంకులేవీ లేవని కేంద్ర మంత్రి ఖట్టర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR)ను పరిశీలిస్తే సరిపోతుందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ఎల్‌అండ్‌టీ (L&T) సంస్థ నుంచి హైదరాబాద్ మెట్రో బాధ్యతలను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం (Takeover) చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రాజెక్ట్ వ్యయంలో కేంద్రం కూడా భాగస్వామి కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గతంలోనే ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు తోడు, నేడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జరిపిన చర్చలు విజయవంతం కావడంతో మెట్రో రెండో దశ విస్తరణ పనులకు లైన్ క్లియర్ అయింది. త్వరలోనే దీనిపై కేంద్రం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఉన్నత పదవిలో ఉన్నా.. ఎల్‌ఎల్‌ఎమ్ ఎంట్రన్స్ రాసిన మంత్రి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha