Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యాదగిరిగుట్టలో రేవంత్ రెడ్డి కేబినెట్ భేటీ.. కారణం ఇదేనా?

యాదగిరిగుట్టలో రేవంత్ రెడ్డి కేబినెట్ భేటీ.. కారణం ఇదేనా?

వార్త 3 months ago

Yadagirigutta Cabinet Meeting: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర పాలనను ప్రజలకు మరింత దగ్గర చేయాలనే లక్ష్యంతో ఆయన కీలక అడుగులు వేస్తున్నారు.

ఇందులో భాగంగానే ఈనెల 23న ప్రతిష్ఠాత్మక నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. నిజానికి ఈ మంత్రివర్గ సమావేశం ఈనెల 21న హైదరాబాద్ లోని సచివాలయంలో జరగాల్సింది. కానీ అదే రోజున బాసర సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈ పవిత్ర వేడుకలకు పలువురు మంత్రులు హాజరుకావాల్సి ఉండటంతో ప్రభుత్వం ఈ సమావేశాన్ని రెండు రోజులు వాయిదా వేసి యాదగిరిగుట్టకు మార్చింది.

Read also: Telangana Cabinet meeting: తెలంగాణ కేబినెట్ భేటీ సడన్ గా వాయిదా.. అసలు కారణం ఇదేనా?

 Yadagirigutta Cabinet Meeting Revanth

యాదగిరిగుట్ట వేదికగా తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఎందుకు?

రాజధాని హైదరాబాద్ కే పరిమితం కాకుండా ప్రముఖ పుణ్యక్షేత్రాల వద్ద ప్రభుత్వ పాలనను అందించాలనేది ముఖ్యమంత్రి ఆలోచన. ఈనెల 23న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో సీఎం రేవంత్ రెడ్డి వేద పాఠశాలను ప్రారంభించనున్నారు. అదే రోజున అక్కడ మంత్రివర్గ సమావేశం కూడా ఏర్పాటు చేయడం విశేషం. ఈ నిర్ణయం ద్వారా తెలంగాణ ప్రజల్లోకి ఆధ్యాత్మిక, రాజకీయ సందేశాన్ని బలంగా తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. కేబినెట్ భేటీని పుణ్యక్షేత్రంలో నిర్వహించడం వల్ల స్థానిక ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టే అవకాశం లభిస్తుంది.

Yadagirigutta Cabinet Meeting: గతంలో మేడారం బాట.. ఇప్పుడు యాదద్రి వైపు అడుగులు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా హైదరాబాద్ వెలుపల కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన సమ్మక్క సారక్క జాతర సమయంలో మేడారంలో మంత్రివర్గ భేటీ నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అక్కడ భక్తుల సౌకర్యాలు, నిధుల విడుదలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు అదే వ్యూహాన్ని యాదగిరిగుట్టలో కూడా అమలు చేయనున్నారు. ఈ నిర్ణయం వల్ల యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల సమస్యలను నేరుగా తెలుసుకుని తక్షణమే పరిష్కరించడానికి వీలవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

కిషన్ రెడ్డి భేటీ సక్సెస్.. మెట్రో ఫేజ్-2కు లైన్ క్లియర్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha