Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బజాజ్ నుంచి కొత్త పల్సర్ N160S, N160SS లాంచ్.. ఫీచర్లు, ధర ఎంతంటే?

బజాజ్ నుంచి కొత్త పల్సర్ N160S, N160SS లాంచ్.. ఫీచర్లు, ధర ఎంతంటే?

వార్త 2 weeks ago

Bajaj Pulsar N160: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్‌ ఆటో తన పాపులర్ మోడల్ పల్సర్‌ ఎన్‌160ను కొత్త ఫీచర్లతో సరికొత్తగా తీర్చిదిద్దింది. ఈ సారి ఎన్‌160 ఎస్‌ (N160S), ఎన్‌160 ఎస్‌ఎస్‌ (N160SS) పేర్లతో రెండు వేరియంట్లను మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది.

వీటి ప్రారంభ ఎక్స్‌షోరూమ్‌ ధరలు వరుసగా రూ. 1,33,511 మరియు రూ. 1,42,585గా కంపెనీ నిర్ణయించింది.

Read Also : Wine Shops Closed: ఎల్లుండి వైన్ షాపులు బంద్

 New Pulsar N160S and N160SS launched by Bajaj.

Bajaj Pulsar N160: శక్తివంతమైన ఇంజిన్.. మెరుగైన పెర్ఫార్మెన్స్

కొత్త పల్సర్‌లో 165 సీసీ నాలుగు వాల్వుల (4-valve) ఇంజిన్‌ను అమర్చారు. ఇది 18.5 హార్స్‌పవర్‌ (HP) శక్తిని ఉత్పత్తి చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ విభాగంలోనే (160cc సెగ్మెంట్) అత్యధిక శక్తిని అందించే ఇంజిన్‌ ఇదే కావడం విశేషం. అంతేకాకుండా ఈ బైక్ కేవలం 4.5 సెకన్లలోనే 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని బజాజ్ వెల్లడించింది. దీనికి తోడు ఎలక్ట్రానిక్‌ త్రాటిల్‌ వ్యవస్థను కూడా జోడించారు, ఇది రైడింగ్‌కు అనుగుణంగా ఇంజిన్‌ స్పందనను మార్చి మరింత సాఫీ ప్రయాణాన్ని అందిస్తుంది.

స్పోర్టీ లుక్ అండ్ సేఫ్టీకి ప్రాధాన్యమిస్తూ రెయిన్, స్పోర్ట్స్, రోడ్, మరియు ఆఫ్‌రోడ్ పేర్లతో 4 రైడింగ్‌ మోడ్‌లను అందించారు. రహదారి పరిస్థితులకు అనుగుణంగా రైడర్లు వీటిని ఎంచుకోవచ్చు. పల్సర్ N160 మోడల్‌లో తొలిసారిగా ట్రాక్షన్‌ కంట్రోల్‌ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. హెవీ ట్రాఫిక్‌లో పదే పదే క్లచ్‌, గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండా ప్రయాణాన్ని సులభతరం చేసే ‘క్రాల్‌ టెక్నాలజీ’ని ఈ బైక్‌లో పరిచయం చేశారు.

కనెక్టివిటీ, సరికొత్త లుక్

ఈ విభాగంలోని స్పోర్ట్స్ బైక్‌లలో తొలిసారిగా 5 అంగుళాల కలర్ డిస్‌ప్లే తెరతో పాటు నేరుగా గూగుల్‌ మ్యాప్స్‌ నావిగేషన్ సదుపాయాన్ని కల్పించారు. బైక్‌కు ఆకర్షణీయమైన కొత్త గ్రాఫిక్స్‌, కలర్డ్ అల్లాయ్‌ వీల్స్‌, అప్‌డేటెడ్ హ్యాండిల్‌బార్‌ మరియు సౌకర్యవంతమైన ఎత్తైన సీటును అందించారు. ఈ కొత్త పల్సర్ N160 బైక్‌లు అట్లాంటిక్‌ బ్లూ, పెర్ల్‌ మెటాలిక్‌ వైట్‌, మరియు బ్రూక్లిన్‌ బ్లాక్‌ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి.

భారత్‌లోకి హువావే రెండు కొత్త ట్యాబ్లెట్లు: ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు స్టార్ట్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha