Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బండి భగీరథ్ కనిపించడం లేదు.. హైదరాబాద్‌లో వెలసిన పోస్టర్లు!

బండి భగీరథ్ కనిపించడం లేదు.. హైదరాబాద్‌లో వెలసిన పోస్టర్లు!

వార్త 3 months ago

Bandi Bhagirath Missing Posters: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.

తాజాగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, షేరిలింగంపల్లి, మియాపూర్ వంటి ప్రధాన ప్రాంతాల్లో ఆయన ‘కనిపించడం లేదు’ అంటూ వెలిసిన పోస్టర్లు కలకలం రేపాయి. మెట్రో పిల్లర్లు, బస్టాప్‌లు మరియు రద్దీగా ఉండే కూడళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ పోస్టర్లను అతికించారు. “బండి భగీరథ్ ఆచూకీ తెలిస్తే వెంటనే పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించండి” అనే కంటెంట్‌తో ఉన్న ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Read Also :Bandi Bhagirath POCSO Case: హనుమాన్ సాక్షిగా ప్రమాణం చెయ్.. బండి సంజయ్‌కు RS ప్రవీణ్ కుమార్ సవాల్

Bandi Bhagirath Missing Posters: పోక్సో కేసులో నిందితుడి కోసం వెతుకులాట!

 POCSO Case Telangana

ఈ పోస్టర్ల వ్యవహారంపై రాజకీయ వర్గాల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవైపు బీజేపీ శ్రేణులు ఇది కావాలనే బండి సంజయ్ కుటుంబాన్ని బద్నాం చేయడానికి ప్రత్యర్థి వర్గాలు చేసిన కుట్రగా కొట్టిపారేస్తున్నాయి. మరోవైపు, కేసు నమోదై రోజులు గడుస్తున్నా నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ఈ కేసు విచారణ కోసం డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసిన నేపథ్యంలో, ఈ పోస్టర్ల ఉదంతం పోలీసులకు సవాల్‌గా మారింది. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఈ పోస్టర్లు అతికించిన వారిని గుర్తించే పనిలో పడ్డారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

గోడ కూలి ఆరుగురు భక్తుల దుర్మరణం.. విచారం వ్యక్తం చేసిన ప్రధాని

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha