Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హనుమాన్ సాక్షిగా ప్రమాణం చెయ్.. బండి సంజయ్‌కు RS ప్రవీణ్ కుమార్  సవాల్

హనుమాన్ సాక్షిగా ప్రమాణం చెయ్.. బండి సంజయ్‌కు RS ప్రవీణ్ కుమార్ సవాల్

వార్త 1 week ago

Bandi Bhagirath POCSO Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన బండి భగీరథ్ పోక్సో కేసు చుట్టూ రాజకీయ సెగలు రాజుకుంటున్నాయి. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ పై, తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఈ కేసులో బాధితులను బెదిరించలేదని బండి సంజయ్ గుడిలో ప్రమాణం చేయగలరా అని ఆయన నిలదీశారు.

Read Also:Illegal Mining Sangareddy: పుల్కల్ మండలంలో అక్రమ మట్టి దందా!

హనుమాన్ గుడిలో తడిబట్టలతో ప్రమాణం చెయ్!

బండి సంజయ్ తనను తాను గొప్ప హనుమాన్ భక్తుడిగా చెప్పుకుంటారని, అదే నిజమైతే హనుమాన్ గుడిలో తడిబట్టలతో ప్రమాణం చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్ విసిరారు. “బాధితులను బెదిరించలేదని గుడిలో ప్రమాణం చేసే దమ్ము బండి సంజయ్‌కు ఉందా? నిజమైన భక్తుడైతే తప్పు చేసిన తన కుమారుడిని పోలీసులకు అప్పగించాలి” అని డిమాండ్ చేశారు.

Bandi Bhagirath POCSO Case: నీ కొడుకు ఏ హుక్కా సెంటర్‌లో ఉంటాడో చెప్పవా?

బండి సంజయ్ గారు నిజంగా హనుమాన్ భక్తుడేనా? అయితే ఆయన కానీ,అతను కుమారుడు బండి సాయి భగీరథ్ ఏనాడైనా హనుమాన్ మాల ధరించాడా? హనుమాన్ ఛాలీసా ఎపుడైనా చదివాడా? చదివితే ఇలా ఉండేవాడా?మనమంతా కాలినడకన భక్తి శ్రద్ధలతో పాదయాత్ర చేస్తుంటే బండి సంజయ్ గారి కొడుకు ఎందుకు బెంజ్ కార్లలో తిరుగుతున్నాడు? సాయి భగీరథ్ మన వర్గాలకు చెందిన మైనర్ అమ్మాయిపై అత్యాచారం చేసి,ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడు అని పేర్కొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గోడ కూలి ఆరుగురు భక్తుల దుర్మరణం.. విచారం వ్యక్తం చేసిన ప్రధాని

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha