Sangli Temple Wall Collapse: మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ప్రకృతి ప్రకోపం ఆరుగురు భక్తుల ప్రాణాలను బలితీసుకుంది. భారీ వర్షం, ఈదురుగాలుల ధాటికి ఓ ఆలయ ప్రాంగణంలోని గోడ కూలిపోవడంతో ఆరుగురు మరణించగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు.
మంగళవారం సాయంత్రం జత్ తహసీల్‌లోని మోతేవాడి గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
Read Also:Chhattisgarh: పుచ్చకాయ తిని బాలుడు మృతి? నలుగురు చిన్నారుల పరిస్థితి విషమం!
Sangli Temple Wall Collapse: వర్షం నుంచి తప్పించుకోబోయి.. మృత్యుఒడికి!
మోతేవాడిలోని మర్గుదేవి వార్షిక జాతర సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి కుండపోత వర్షం, బలమైన ఈదురుగాలులు వీచాయి. వాన నుంచి రక్షణ పొందేందుకు భక్తులంతా ఆలయ ప్రాంగణంలోని ఒక పాత గోడ, రేకుల షెడ్డు కిందకు చేరారు. అయితే, గాలుల తీవ్రతకు ఆ గోడ ఒక్కసారిగా కుప్పకూలి వారిపై పడింది.
మృతుల్లో కర్ణాటక భక్తులు..
ప్రమాద సమయంలో అక్కడ సుమారు 350 మంది భక్తులు ఉన్నట్లు సాంగ్లీ ఎస్పీ తుషార్ దోషి తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని స్థానికులు, అధికారులు కలిసి వెలికితీశారు. మరణించిన ఆరుగురిలో ముగ్గురు స్థానిక మోతేవాడి గ్రామానికి చెందిన వారు కాగా, మిగిలిన ముగ్గురు కర్ణాటకలోని బీజాపూర్ తాలూకా వాసులుగా గుర్తించారు. గాయపడిన 14 మందిని వెంటనే ఆసుపత్రికి తరలించారు, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ఘోర ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “సాంగ్లీలో గోడ కూలిన ఘటనలో ప్రాణనష్టం జరగడం అత్యంత బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
నీట్-యూజీ 2026 పేపర్ లీక్: నాసిక్‌లో బీఏఎంఎస్ విద్యార్థి అరెస్ట్!

