Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బండి భగీరథ్ కేసుపై స్పందించిన సీఎం రేవంత్

బండి భగీరథ్ కేసుపై స్పందించిన సీఎం రేవంత్

వార్త 2 weeks ago

Bandi Bhagirath case: పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై ఒక మైనర్ బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఫిర్యాదుతో పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదైంది తెలిసిందే.

ఈ కేసు పై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అత్యంత తీవ్రంగా స్పందించారు. ఈ కేసులో జరిగిన జాప్యంపై పోలీసు శాఖపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం ముందు ఎవరైనా సమానులేనని స్పష్టం చేస్తూ, తక్షణమే నిష్పక్షపాత విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు.

Read Also: Medak Census 2026:మెదక్ జిల్లాలో జన గణన షురూ: కలెక్టర్ ప్రతిమ సింగ్ పిలుపు

 CM Revanth Takes Serious Note of the Bandi Bhagirath Affair

Bandi Bhagirath case: పోలీసుల జాప్యంపై ముఖ్యమంత్రి ఆగ్రహం

మే 8వ తేదీనే బాధితుల నుంచి ఫిర్యాదు అందినప్పటికీ, ఇప్పటివరకు తగిన చర్యలు తీసుకోకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంత సున్నితమైన కేసులో ఎందుకు ఆలస్యం జరిగిందని డీజీపీని ప్రశ్నించారు. దీనిపై డీజీపీ స్పందిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన బందోబస్తు విధుల్లో సిబ్బంది నిమగ్నమవ్వడం వల్లే కొంత ఆలస్యం జరిగిందని వివరణ ఇచ్చారు. అయితే, రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా విచారణ జరపాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

డీజీపీ వివరణ అనంతరం, కేసు పురోగతి కోసం తక్షణమే ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కేసును సమగ్రంగా, దర్యాప్తు చేసి పూర్తి నివేదిక సమర్పించాలని కోరారు. బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదు.. ముందస్తు బెయిల్ కు యత్నం?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha