Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బండి సంజయ్ రాజీనామా చేయాలి: కార్యదర్శి ఈశ్వరయ్య డిమాండ్

బండి సంజయ్ రాజీనామా చేయాలి: కార్యదర్శి ఈశ్వరయ్య డిమాండ్

వార్త 3 months ago

Bandi Sanjay: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తన ఎంపి, మంత్రి పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు.

ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన బిజెపి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేంద్ర మంత్రి కుమారుడు బండి సాయి భగీరథ్ 17 ఏళ్ల మైనర్ బాలికను లైంగికంగా వేధించినందుకు తెలంగాణలోని బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన పేర్కొన్నారు. బిజెపి హయాంలో మహిళల భద్రత గాలిలో దీపంలా మారింది. బేటీ బచావో- బేటీ పడావో వంటి నినాదాలు కేవలం ఎన్నికల ప్రసంగాలకు, ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యాయి.

Read also: Nara Lokesh Singapore Visit: నేడు సింగపూర్ కు మంత్రి లోకేష్

 CPI demands Bandi Sanjay resignation.

Bandi Sanjay: రాజీనామాతోనే న్యాయం

సొంత పార్టీ నేతల కుటుంబ సభ్యులే ఇలాంటి అమానుష ఘటనలకు పాల్పడుతుంటే, మహిళా రక్షణ గురించి మాట్లాడే నైతిక హక్కు బిజెపికి ఎక్కడుంది? అని ఈశ్వరయ్య ప్రశ్నించారు. ఈ ఘటనపై బిజెపి అగ్రనాయకత్వం మౌనం వహించడం వారి రాజకీయ కపటత్వాన్ని, నేరస్థులను వెనకేసుకొచ్చే ధోరణిని స్పష్టం చేస్తోందని విమర్శించారు. కేంద్ర మంత్రి పదవిలో బండి సంజయ్ కొనసాగడం వల్ల విచారణ సజావుగా సాగదని, అధికార బలంతో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని సిపిఐ ఆందోళన వ్యక్తం చేసింది. బాధితురాలికి న్యాయం జరగాలంటే రాజీనామా ఒక్కటే మార్గమని ఈశ్వరయ్య స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

అనంతలో రాష్ట్ర నేతల హడావుడి.. మూడు రోజులు ముగ్గురు నేతలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha