Bandi Bhagirath Case: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన లైంగిక వేధింపుల కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. వ్యవహారంపై బాధితురాలి తల్లి లేఖ విడుదల చేశారు.
తమకు జరిగిన అన్యాయాన్ని, ఎదురైన ఒత్తిళ్లను ఆమె ఆ లేఖలో సవివరంగా పేర్కొన్నారు.
తమది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబమని, తమకు ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవని బాధితురాలి తల్లి స్పష్టం చేశారు. 2025లో తన కుమార్తెకు బండి భగీరథ్‌తో పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత భగీరథ్ తన కుమార్తెపై శారీరక సంబంధం కోసం తీవ్రంగా ఒత్తిడి తీసుకువచ్చాడని ఆమె ఆరోపించారు. వేధింపులకు గురిచేస్తూ ఇబ్బందులు పెట్టాడని లేఖలో పేర్కొన్నారు.
Read Also: Chilipally Theft: దొంగల బీభత్సం: 100 తులాల బంగారం, కిలో వెండి అపహరణ!
Bandi Bhagirath Case: ఫామ్‌హౌస్ ఘటన
మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో జరిగిన ఘటనను ఆమె వివరించారు. కొత్త సంవత్సరం వేడుకల పేరుతో తన కుమార్తెను మద్యం సేవించమని బలవంతం చేశారని, భగీరథ్ అత్యంత అనుచితంగా ప్రవర్తించాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి వారిద్దరి మధ్య జరిగిన వాట్సాప్ చాట్స్, మెసేజ్‌లు, నిందితుడు తప్పు ఒప్పుకుంటూ పంపిన క్షమాపణ సందేశాలు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఆమె వెల్లడించారు.
బండి సంజయ్‌ను కలిసినా ఫలితం లేదు
న్యాయం కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను స్వయంగా కలిసినట్లు బాధితురాలి తల్లి తెలిపారు. అయితే అక్కడ తమకు భరోసా లభించకపోగా, రివర్స్ కేసులు పెట్టి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారంటూ తమనే నిందితులుగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆపాలని, తమ కుటుంబానికి రక్షణ కల్పించి, స్వతంత్ర దర్యాప్తు ద్వారా న్యాయం చేయాలని ఆమె మహిళా కమిషన్, న్యాయవ్యవస్థను కోరారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
బాధితురాలి వయసుపై హైకోర్టు కీలక ప్రశ్నలు.. రేపు మధ్యంతర బెయిల్‌పై తీర్పు!

