Bandi Bhagirath SIT Notices: తెలంగాణలో సంచలనం సృష్టించిన పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నోటీసులు జారీ చేసింది.
లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఈ కేసు విచారణను వేగవంతం చేస్తూ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read Also: Telangana Political : కవితకు కోర్టు సమన్లు.. రేపు హాజరు కావాలన్న ఆదేశం
విచారణకు హాజరు కావాలని స్పష్టీకరణ
మైనర్ బాలికపై లైంగిక దాడి చేశాడనే ఆరోపణలతో భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసులో వివరణ కోరేందుకు సిట్ సిద్ధమైంది. ఇందులో భాగంగా రేపు మధ్యాహ్నం 2:00 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. దర్యాప్తులో భాగంగా ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయాలని అధికారులు భావిస్తున్నారు.
Bandi Sanjay Son Case
Bandi Bhagirath SIT Notices: సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం
కేంద్ర మంత్రి కుమారుడు నిందితుడిగా ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేసు విచారణలో ఎలాంటి పక్షపాతం ఉండకూడదని, అత్యంత పారదర్శకంగా దర్యాప్తు జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే డీజీపీని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే కేసు బాధ్యతలను సిట్‌కు అప్పగించి విచారణను ముమ్మరం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

