Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బండి సంజయ్ కొడుకు సాయి భగీరధ్ పై పోక్సో కేసు  నమోదు.!

బండి సంజయ్ కొడుకు సాయి భగీరధ్ పై పోక్సో కేసు నమోదు.!

వార్త 2 weeks ago

Bandi Sai Bhagirath: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరధ్‌పై కేసు నమోదైంది. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మొయినాబాద్ ప్రాంతంలోని ఫామ్ హౌస్‌తో పాటు మరికొన్ని చోట్ల ఈ దారుణం జరిగినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భగీరధ్ వేధింపులు భరించలేక తమ కూతురు రెండు సార్లు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించిందని వారు ఆరోపిస్తున్నారు.

Read also: PM Modi Hyderabad visit: రేపు ప్రధాని రాకతో భాగ్యనగరంలో కట్టుదిట్టమైన భద్రత

 Bandi Sanjay son Bhagirath case news

Bandi Sai Bhagirath: పోలీసులు నమోదు చేసిన సెక్షన్ల వివరాలు

బాధితుల ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు భగీరధ్‌పై బిఎన్ఎస్ 74, 75 సెక్షన్లతో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ 11, 12 కింద కేసులు నమోదు చేశారు. మైనర్ బాలికకు మద్యం తాగించి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. కేసు నుంచి తప్పించుకోవడానికి నిందితుడు తమ కూతురిపైనే తప్పుడు కేసులు పెడుతున్నాడని బాధితురాలి తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది.

హనీ ట్రాప్ వాదనపై పెరుగుతున్న అనుమానాలు

ఈ ఘటనపై బండి సంజయ్ వర్గం స్పందిస్తూ ఇది ఒక హనీ ట్రాప్ అని వాదిస్తోంది. సాయి భగీరధ్‌ను బుజ్జగించి 5 కోట్లు డిమాండ్ చేశారని, అందులో భాగంగానే 50 వేల రూపాయలు చెల్లించినట్లు వారు చెబుతున్నారు. అయితే అసలు తప్పు చేయనప్పుడు నిందితుడి తరపు వారు ఎందుకు డబ్బులు ఇచ్చారనే ప్రశ్నలు ఇప్పుడు అందరిలోనూ మొదలయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha