Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
DMKపై కాంగ్రెస్ ఆగ్రహం !

DMKపై కాంగ్రెస్ ఆగ్రహం !

వార్త 3 months ago

మిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. దశాబ్దాల కాలంగా మిత్రపక్షాలుగా ఉన్న డీఎంకే (DMK), కాంగ్రెస్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు భగ్గుమన్నాయి.

మిళనాడులో బలమైన కూటమిగా కొనసాగుతున్న డీఎంకే, కాంగ్రెస్ బంధంలో ఒక్కసారిగా చీలికలు కనిపిస్తున్నాయి. తాజాగా తమిళనాడు కాంగ్రెస్ కమిటీ సోషల్ మీడియా వేదికగా డీఎంకేపై చేసిన విమర్శలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గత కొన్ని ఎన్నికలుగా రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ అందించిన మద్దతు వల్లే డీఎంకే అధికారంలోకి రాగలిగిందని, రాజకీయంగా లబ్ధి పొందిందని కాంగ్రెస్ గుర్తు చేస్తోంది. అయితే, ఇప్పుడు అదే డీఎంకే తన స్వార్థ రాజకీయాల కోసం ప్రజాస్వామ్య విలువలను పక్కనబెట్టి, సమాఖ్య స్ఫూర్తి కోసం పోరాడే శక్తులపైనే ఎదురుదాడికి దిగడం విచారకరమని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. “వాస్తవాలను ఎవరూ దాచలేరు, డీఎంకే ద్వంద్వ నీతిని తమిళ ప్రజలు గమనిస్తున్నారు” అంటూ కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో నెలకొన్న తీవ్ర అసహనాన్ని సూచిస్తున్నాయి.

Read Also : ప్రకాశ్ రాజ్ 'సెల్యూట్' ఎవరికో తెలుసా?

రాహుల్ గాంధీ నాయకత్వంపై విమర్శలే లక్ష్యంగా..

ముఖ్యంగా రాహుల్ గాంధీకి ‘లెక్చర్లు’ ఇచ్చే స్థాయి డీఎంకేకు లేదని కాంగ్రెస్ కుండబద్దలు కొట్టింది. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కోవడంలో రాహుల్ గాంధీ పోరాడుతుంటే, క్షేత్రస్థాయిలో డీఎంకే తన వైఖరిని మార్చుకుని మిత్రద్రోహానికి పాల్పడుతోందని ఆరోపిస్తోంది. డీఎంకే నాయకత్వం అనుసరిస్తున్న తీరు ‘హిపోక్రసీ’ (కపటత్వం) అంటూ కాంగ్రెస్ చేసిన ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కూటమి ధర్మాన్ని విస్మరించి, రాహుల్ గాంధీని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హస్తం పార్టీ హెచ్చరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో, రాబోయే ఎన్నికల నాటికి ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కొనసాగుతుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఈ అంతర్గత కలహాలు అటు అన్నాడీఎంకే, ఇటు బీజేపీకి రాజకీయంగా కలిసి వచ్చే అవకాశం ఉందనే చర్చ కూడా సాగుతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం.. తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ స్పందన ఇదే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha