Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బండ్ల గణేష్ వివాదంపై మరోసారి స్పందించిన పీవీపీ

బండ్ల గణేష్ వివాదంపై మరోసారి స్పందించిన పీవీపీ

వార్త 1 week ago

Bandla Ganesh : టాలీవుడ్ నిర్మాత, పీవీపీ వెంచర్స్ అధినేత ప్రసాద్ వి. పొట్లూరి మరోసారి నిర్మాత బండ్ల గణేష్‌తో జరిగిన వివాదంపై స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'టెంపర్' సినిమా సమయంలో తలెత్తిన సమస్యలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.

ఆ చిత్రానికి తాను ఒక్కడినే ఫైనాన్షియర్‌నని, బ్యాంకు తరహాలో వడ్డీకి డబ్బులు ఇచ్చానని తెలిపారు. అయితే ఆ డబ్బులను తిరిగి వసూలు చేసుకునే సమయంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొన్నారు.

"మన డబ్బు తీసుకోవడానికే అవమానాలు"

పీవీపీ మాట్లాడుతూ.. "మన డబ్బు మనం తీసుకోవడానికి కూడా అవమానాలు పడాల్సి రావడం బాధాకరం" అని అన్నారు. సినిమా నిర్మాణం కంటే దారుణమైన వ్యాపారం మరొకటి లేదని వ్యాఖ్యానించారు. నిర్మాతలు కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీసినా వారికి పరిశ్రమలో సరైన గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమలో ఉంటే మన మీద మనమే అశుద్ధం వేసుకున్నట్లుగా అనిపిస్తుందని ఘాటుగా వ్యాఖ్యానించారు.

Read Also: Rajasekhar Tirumala visit: తిరుమలలో నటుడు రాజశేఖర్ ఫ్యామిలీ.. ఫోటోలు చూశారా?

 Bandla Ganesh

నిర్మాతలను జోకర్లలా చూస్తున్నారు

సెట్‌లో నిర్మాతలనే జోకుల కోసం టార్గెట్ చేస్తారని పీవీపీ ఆరోపించారు. సినిమా హిట్ అయితే అందరూ క్రెడిట్ తీసుకుంటారని, కానీ ఫ్లాప్ అయితే రోడ్డు మీద పడేది నిర్మాత మాత్రమేనని అన్నారు. హాలీవుడ్‌లో ఉన్నట్లుగా ఇక్కడ స్టూడియో వ్యవస్థ లేదని, హీరోలే పరిశ్రమను నడిపిస్తున్నారని చెప్పారు. నిర్మాతలకు మాత్రం విలువ లేకుండా పోయిందని వాపోయారు.

టాలీవుడ్‌ను వదిలేసిన కారణం

ఈ పరిస్థితుల వల్లే తాను టాలీవుడ్‌కు దూరమయ్యానని పీవీపీ వెల్లడించారు. అలాంటి వ్యవస్థలో కొనసాగడం తనకు ఇష్టం లేక పరిశ్రమ నుంచి తప్పుకున్నానని పేర్కొన్నారు. పీవీపీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్‌లో నిర్మాతల పరిస్థితిపై మళ్లీ చర్చ మొదలైంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

'శ్రీనివాస మంగాపురం' సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha