Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు!

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు!

వార్త 3 weeks ago

AP Weather Update: నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) గమనం ఒకింత మందగించి ఎండలు, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన అల్పపీడనం (Low Pressure Area), దానికి తోడైన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రాగల 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులు, బలమైన పిడుగులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

Read Also:Telangana Rains: బంగాళాఖాతంలో అల్పపీడనంతో తెలంగాణలో వర్షాలు

AP Weather Update: కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్ష సూచన

అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుందని, తీరప్రాంత పొడుగునా బలమైన గాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

జిల్లాల వారీగా వాతావరణ వివరాలు:

  • తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు మరియు రాయలసీమలోని అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.
  • పిడుగుల హెచ్చరిక (Lightning Alert): బాపట్ల, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో వర్షంతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. పొలాల్లో పనిచేసే రైతులు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండరాదని అధికారులు హెచ్చరించారు.
  • చెదురుమదురు జల్లులు: అనకాపల్లి, విశాఖపట్నం, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మేఘావృత వాతావరణంతో పాటు చెదురుమదురుగా తేలికపాటి జల్లులు పడే వీలుంది.

Epaper: epaper.vaartha.com

రైతులకు గుడ్ న్యూస్.. బంగాళాఖాతంలో అల్పపీడనం !!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha